జబ్బరితోటలో డయేరియా
డాబాగార్డెన్స్: బీచ్‌రోడ్డు నేవల్ క్యాంటీన్ ఏరియా జబ్బరితోట పట్టణ ఆరోగ్య కేంద్ర పరిధిలో 16 డయేరియా కేసులు నమోదయ్యాయి. వీరిలో 9 మంది ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. మిగిలిన ఏడుగురికి ఇంటి వద్దనే చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న డీఎంహెచ్‌వో జగదీశ్వరరావు మంగళవారం సాయంత్రం ఆ ప్రాంతాన్ని సందర్శించారు. జీవీఎంసీ కమిషనర్‌తో చర్చించి నీటి శాంపిల్స్ లేబొరేటరీకి పంపించినట్లు తెలిపారు. 24 గంటల వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. 8 మెడికల్ టీంలను ఏర్పాటు చేసి ప్రతి గృహాన్ని సందర్శించి డయేరియా వ్యాధిగ్రస్తులను గుర్తించి వైద్య శిబిరానికి తరలించాలని ఆదేశించామన్నారు. నీటి ద్వారా వచ్చే వ్యాధుల గురించి అవగాహన కల్పిస్తున్నామన్నారు. 37వ వార్డు పరిధి జబ్బరితోటలో గత కొంత కాలంగా తాగునీరు కలుషితం అవుతోందని, చర్యలు చేపట్టాలని గత కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లినట్లు వార్డు కార్పొరేటర్ చెన్నా జానకీరామ్ తెలిపారు. అయినా పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment