● దివ్యాంగులకు ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 28న కలెక్టరేట్ ఎదురుగా వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
● మునిసిపల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 22న డీఈవో కార్యాలయం ఎదుట యూటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
● హెల్త్ సెక్రటరీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అక్టోబర్ 14న జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద యునైటెడ్ విలేజ్ అండ్ వార్డ్ హెల్త్ సెక్రటరీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
●నూతన మద్యం పాలసీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మహిళా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో జీవీఎంసీ వద్ద, జిల్లాలోని పలు ప్రాంతాల్లో ధర్నా నిర్వహించారు.
● భారీగా పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఈ నెల 11న ఽసీతమ్మధార తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.
● ప్రభుత్వం ఉచిత ఇసుక అందించాలని కోరుతూ భవన నిర్మాణ కార్మికులు జోనల్ కార్యాలయాల వద్ద ఆందోళన చేపట్టారు. పనులు లేక అల్లాడుతున్నామని వాపోయారు.
● ఎంజీఎం సెవెన్ హిల్స్ ఆస్పత్రి యాజమాన్యం తొలగించిన 38 మంది హౌస్ కీపింగ్ కార్మికులను విధుల్లో కొనసాగించాలంటూ ఈనెల 25వ తేదీన కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.
● భీమిలి బీచ్ రోడ్డు రామాద్రి తీరం వెంబడి మత్స్యకారులు ఏర్పాటు చేసుకున్న 45 దుకాణాలను పర్యాటక శాఖ, జీవీఎంసీ అధికారులు ఈనెల 23న తొలగించేశారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వమే తమ జీవితాలతో ఆడుకుంటుంటే, అండగా నిలవాల్సిన నాయకులు ముఖం చాటేస్తుంటే తమ గోడు ఎవరికి చెప్పుకోవాలంటూ ఈనెల 25న వీరంతా ఆందోళనకు దిగారు.
Comments
Please login to add a commentAdd a comment