మా బతుకులు ‘చెత్త’ పాల్జేసేసిందీ!
ఇచ్చిన ప్రతి హామీనీ తుంగలో తొక్కేసిన కూటమి ప్రభుత్వం.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే కాంట్రాక్టు పారిశుధ్య కార్మికుల జీవితాల్నీ రోడ్డున పడేస్తోంది. ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు ఇచ్చిన హామీ ప్రకారం కేజీహెచ్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులకు నెలకు రూ.26 వేల వేతనం ఇవ్వాలని కోరుతూ ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కేజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట ఈనెల 18న ధర్నా నిర్వహించారు. అదేవిధంగా.. మూడు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంపై కేజీహెచ్ సెక్యూరిటీ గార్డులు ఈ నెల 12న లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment