సింగపూర్ విమానానికి 76.28%ఆక్యుపెన్సీ
మేఘాలలో
విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణికుల తాకిడి గణనీయంగా పెరుగుతోంది. ఆర్థిక, పర్యాటక రాజధానిగా ఎదుగుతున్న నగరం నుంచి రాకపోకలు సాగించే వారి సంఖ్య ఊపందుకుంటోంది. ప్రధానంగా గత నెల రోజుల్లోనే విశాఖ నుంచి ముంబై, బెంగళూరు ఆక్యుపెన్సీ 90 శాతానికి పైగా నమోదైంది. ప్రతి రోజు విశాఖ విమానాశ్రయం నుంచి 32 సర్వీసులు రాకపోకలు సాగిస్తుండగా.. అన్ని కూడా 76 శాతానికి పైగానే ఆక్యుపెన్సీ ఉంటుండడం విశేషం. కోవిడ్ తరువాత ఆ స్థాయిలో ఆక్యుపెన్సీ వృద్ధి ఇదే కావడం గమనార్హం. – విశాఖ సిటీ
90
శాతానికి పైగా ఆక్యుపెన్సీ
జోరుగా
విమానయానం
టాప్‌లో ముంబై, బెంగళూరు
దేశ విమాన సర్వీసుల్లో ముంబై, బెంగళూరులు టాప్ గేర్‌లో దూసుకుపోతున్నాయి. 90 శాతానికి పైగా ఆక్యుపెన్సీ సాధిస్తున్నాయి. ముంబైకు అక్టోబర్ నెలతో పోలిస్తే నవంబర్‌లో 11.36 శాతం అధికంగా ప్రయాణికులు రాకపోకలు సాగించారు. అక్టోబర్‌లో 8,877(79.95 శాతం) మంది ప్రయాణించగా.. నవంబర్‌లో 10,793(91.31 శాతం) మందికి పెరిగారు. అలాగే బెంగళూరు అక్టోబర్ కంటే నవంబర్‌లో 18 శాతం మేర ఆక్యుపెన్సీ వృద్ధిని సాధించింది. అయితే బెంగళూరుకు సర్వీసులు తగ్గడంతో సీట్ల సామర్థ్యం కూడా తగ్గింది. దీంతో 94.7 శాతం ఆక్యుపెన్సీలో బెంగళూరు సర్వీసులు నడిచాయి.
పెరిగిన సీట్ల సామర్థ్యం
ఆక్యుపెన్సీ వృద్ధి చెందుతుండడంతో విమాన సర్వీసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇందుకు నెల రోజుల్లో సీట్ల సంఖ్య పెరుగుదలే నిదర్శనం. ముంబైకి సంబంధించి అక్టోబర్‌లో 11,102 సీట్ల సామర్థ్యం ఉండగా.. నవంబర్‌లో 11,820కి పెరిగింది. అలాగే అంతర్జాతీయ సర్వీస్ సింగపూర్‌కు అక్టోబర్‌లో 3,165 సీట్లు కాగా.. నవంబర్‌లో 3,331కి పెరిగాయి.
హైదరాబాద్, చైన్నెలకు పెరుగుదల
హైదరాబాద్, చైన్నె నగరాలకు కూడా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. హైదరాబాద్‌కు అక్టోబర్‌లో 40,632(80.64 శాతం) మంది ప్రయాణించగా.. నవంబర్‌లో 42,658(86.8 శాతం) మంది రాకపోకలు సాగించారు. అలాగే చైన్నెకు అక్టోబర్‌లో 11,791((70.53 శాతం) మంది, నవంబర్‌లో 12,649(78.50 శాతం) మంది ప్రయాణించారు. అయితే ఢిల్లీకి మాత్రం నెల రోజుల్లో 4 శాతం మేర ఆక్యుపెన్సీ తగ్గింది. అయినప్పటికీ.. 80 శాతానికి పైగా ప్రయాణికులతో నిత్యం సర్వీసులు నడుస్తున్నాయి. అంతర్జాతీయ విమాన సర్వీస్ సింగపూర్‌కు కూడా నెల రోజుల్లో స్వల్పంగా ప్రయాణికుల సంఖ్య పెరిగారు. అక్టోబర్‌లో 2,381 మంది ప్రయాణించగా.. నవంబర్‌లో 2,541 మందికి పెరిగారు. ఇది కూడా దేశీయ సర్వీసులకు తీసిపోకుండా 75 శాతానికి పైగా ఆక్యుపెన్సీతో నడుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment