నేత్రపర్వంగా నృత్యోత్సవం
మద్దిలపాలెం: కళాభారతి ఆడిటోరియంలో విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో శుక్రవారం నృత్యోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు ప్రదర్శనలను కళాభారతి ప్రధాన కార్యదర్శి గుమ్ములూరి రాంబాబు, ఎస్‌బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ పంకజ్ కుమార్, అతిథులు అన్షు, ఎ.ఇందిర, పిల్ల రమణమూర్తి, టేకుమళ్ల శ్యామల జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం నాట్య కళాక్షేత్ర మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అసోసియేషన్ విద్యార్థులు భరతనాట్య ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. మార్గశిర మాసం సందర్భంగా కనకమహాలక్ష్మి అమ్మవారి ప్రాశస్త్యాన్ని నృత్యరూపంలో ప్రదర్శించి ఆకట్టుకున్నారు. డాక్టర్ ఎం. బాలమురళీకృష్ణ స్వరపరిచిన థిల్లానా కృతికి లయబద్ధమైన కదలికలు, అందమైన భంగిమలతో చేసిన నాట్య ప్రదర్శన అందరినీ అబ్బురపరిచింది.
Comments
Please login to add a commentAdd a comment