సీతమ్మధార: ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి నిర్వహణ బాధ్యతలు చేపట్టిన కిమ్స్ యాజమాన్యం ఆస్పత్రిలో 20 శాతం మంది రోగులకు ఉచిత వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు జిల్లా కలెక్టర్, వీఎంఆర్‌డీఏ కమిషనర్‌కు లేఖ రాశారు. సీతమ్మధార నార్త్ ఎక్స్‌టెన్షన్ ప్రాంతంలో విలువైన ఓపెన్ ఏరియా/పార్క్ స్థలాన్ని గజం రూ.200 చొప్పున ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి, రాజీవన్ ఆస్పత్రికి 1988లో కేటాయించారని పేర్కొన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగుల్లో 10 నుంచి 20 శాతం మందికి ఉచిత వైద్యం అందించాలన్న ఒప్పందంతో భూములు ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిని కిమ్స్ ఆస్పత్రి మేనేజ్‌మెంట్ మూడు నెలల క్రితం దక్కించుకుందని తెలిపారు. 300 పడకలతో ఉన్న ఆ ఆస్పత్రిలో ఉచిత వైద్యానికి 20 శాతం చొప్పున 60 బెడ్లు, రూమ్స్ లేదా 15 శాతం చొప్పున 45 బెడ్స్ కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో మార్కెట్ విలువ గజం రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఉందన్నారు. అప్పట్లో కేవలం రూ.200కే ఇవ్వడంతో ఇప్పు డా స్థలం విలువ 750 నుంచి వెయ్యి రెట్లు పెరిగిందని వెల్లడించారు. ఎన్‌ఆర్‌ఐ నుంచి నిర్వహణ బాధ్యతలు తీసుకున్న కిమ్స్ ఈ మూడు నెలల్లో ఎంత మంది రోగులకు ఉచిత వైద్యం అందించిందన్న వివరాలు సేకరించాలని ఆ లేఖలో కోరారు. అలాగే ప్రతి 15 రోజులకు ఒకసారి ఉచిత వైద్యం అందించిన జాబితాను అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు
Comments
Please login to add a commentAdd a comment