విదేశీ విద్యకు సాయమేదీ.?
జగనన్న విద్యాదీవెన పథకం కింద విదేశాల్లో చదువుకునే అర్హులైన విద్యార్థులకు ట్యూషన్ ఫీజును పూర్తిగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే చెల్లించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకై తే రూ.1.25 కోట్లు, ఇతరులకు రూ. కోటి వరకు మంజూరుకు నిర్ణయించి.. పక్కాగా అమలు చేసింది. 2022–23లో 12 మందికి రూ.1,11,82,223, 2023–24లో ఏడుగురు విద్యార్థులకు రూ.1,06,40,787 అందించారు. జగనన్న సివిల్ సర్వీసెస్ పథకం కింద ఐఏఎస్ వంటి అత్యున్నత పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ఐదుగురు విద్యార్థులకు రూ.5 లక్షలు ప్రోత్సహకాలను అందించారు. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వ పాలనలో వీటి ఊసే లేదు.
Comments
Please login to add a commentAdd a comment