ఇంకా అందని యూనిఫారాలు
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో బడులు తెరిచిన తొలిరోజునే ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని విద్యార్థులందరికీ తొమ్మిది రకాల వస్తువులతో కూడిన విద్యాకానుక అందించేవారు. ఏటా సుమారుగా 90 వేల మంది విద్యార్థులకు జగనన్న విద్యాకానుక రూపేణా రూ.21.15 కోట్లు ఖర్చు చేశారు. 2024–25 విద్యా సంవత్సరంనకు ఎన్నికల ముందే అన్ని రకాల వనరులు సమకూర్చారు. ఈ లోగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వీటి పంపిణీ సవ్యంగా జరగలేదు. విద్యా కానుకను ‘స్టూడెంట్ కిట్’గా పేరు మార్చినా.. వాటిని పూర్తి స్థాయిలో అందించే విషయంలో ప్రభుత్వం శ్రద్ధ చూపలేదు. ఇప్పటికీ విద్యార్థులకు యూనీఫారాలు, షూస్ ఇంకా ఇవ్వలేదు.
Comments
Please login to add a commentAdd a comment