జగజ్జంత్రీ
● సీజ్ చేసిన ప్రాపర్టీని బ్యాంక్‌లో తనఖా పెట్టిన ఘనుడు ● స్వాధీన హెచ్చరిక బోర్డు ఉన్నా రుణమిచ్చిన యూనియన్ బ్యాంక్ ● చీటింగ్, నకిలీ డాక్యుమెంట్ల సృష్టి, ఇలా వివిధ స్టేషన్లు, కోర్టుల్లో 97 కేసులు ● తాజాగా యూనియన్ బ్యాంక్ ఎండీకి అడ్వకేట్ వరుణ్ కుమార్ ఫిర్యాదు
సీఐడీకే
ఝలక్ ఇచ్చిన హయగ్రీవ ఎండీ
జగదీశ్వరుడు
సీఐడీలో రెండు కేసులు
జగదీశ్వరుడిపై ఇప్పటికే సీఐడీలో రెండు కేసులు నమోదయ్యాయి. భీమిలి మండలం చిప్పాడ గ్రామంలో సర్వే నెంబర్ 160/1లో అర్జర్ల శ్రీనివాసరావు, అతని కుటుంబ సభ్యులకు చెందిన సుమారు 4.61 ఎకరాలకు దొంగ డాక్యుమెంట్లు సృష్టించి హయగ్రీవ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. దీనిపై సదరు యజమానులు ఫిర్యాదు చేయగా సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. అలాగే మరో వ్యవహారంలో కేసు (నంబర్ 3/2013) నమోదు చేయడంతో పాటు ఎంపీవీ కాలనీ సెక్టార్–2లో సర్వే నంబర్ 5/పి, 6/పిలో నిర్మాణంలో ఉన్న 3,126 చదరపు గజాల భవనాన్ని 2015, ఆగస్టు 11వ తేదీన జీవో 124 ప్రకారం స్వాధీనం చేసుకున్నారు.
అడుగుపెట్టిన
చోటల్లా మోసమే..
జగదీశ్వరుడు అడుగు పెట్టిన ప్రతీ చోటా ప్రభుత్వ సంస్థలను, భాగస్వాములను, ప్రజలను నిలువునా ముంచుతూనే ఉన్నాడు. అలాగే విలువైన భూములకు నకిలీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్లు, నకిలీ డాక్యుమెంట్లతో ల్యాండ్ పూలింగ్‌లో మోసాలు, సంస్థలో నిధులు కాజేసి భాగస్వాములను మోసం చేయడం ఇలా అనేక కేసులు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయి.
విశాఖ సిటీ: భూములకు నకిలీ సేల్ డీడ్లు సృష్టించాడు.. బ్యాంకులో రుణాలు తీసుకొని మళ్లించాడు. నకిలీ జీఎస్టీ ఇన్ వాయిస్‌లతో ఇన్‌పుట్ క్రెడిట్ క్లెయిమ్ చేశాడు. సంస్థలో నిధులను కాజేసి భాగస్వాములను నట్టేటముంచాడు. రిసార్టులో గ్యాంబ్లింగ్.. చీటింగ్.. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. కోర్టులు, పలు స్టేషన్లలో 97 కేసులు ఉన్న ఘనుడు హయగ్రీవ ఎండీ జగదీశ్వరుడు.. తాజాగా నేర పరిశోధనా సంస్థ(సీఐడీ)కు కూడా ఝలక్ ఇచ్చాడు. సీఐడీ సీజ్ చేసిన భవనాన్ని సైతం బ్యాంక్‌లో తనఖా పెట్టి దర్జాగా రుణం తీసుకున్నాడు. దీనిపై సీఐడీ అదనపు డీజీకి ఫిర్యాదులు అందినప్పటికీ చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కిస్తుండడం గమనార్హం. జగదీశ్వరుడిపై 97 కేసులు ఉన్నా.. బ్యాంకు రుణాలు దుర్వినియోగం చేసిన వ్యవహారంలో కేంద్రమే లుక్‌అవుట్ నోటీసు జారీ చేసినా దర్జాగా తిరిగేస్తున్నాడు. తాజాగా బ్యాంక్ రుణాల ద్వారా మనీ లాండరింగ్‌కు పాల్పడుతున్నట్లు అడ్వకేట్ వరుణ్‌కుమార్ నేరుగా యూనియన్ బ్యాంక్ ఎండీకి ఫిర్యాదు చేశాడు.
స్వాధీనం చేసుకున్న నిర్మాణాన్ని
బ్యాంకులో తనఖా
సీఐడీ స్వాధీనం చేసుకున్న నిర్మాణాన్ని సైతం జగదీశ్వరుడు బ్యాంకులో తనఖా పెట్టడం విశేషం. 2020 సెప్టెంబర్‌లో యూనియన్ బ్యాంకు నుంచి సుమారు రూ.3.67 కోట్లు దర్జాగా రుణం తీసుకున్నాడు. ఒకవైపు సీఐడీ ఆ భవనానికి స్వాధీన హెచ్చరిక బోర్డును సైతం ఏర్పాటు చేసింది. ఈ స్థలంపై అమ్మకాలు, కొనుగోలు నిషేధించినట్లు అందులో పేర్కొంది. అయినప్పటికీ జగదీశ్వరుడు బ్యాంకుకు మార్ట్‌గేజ్ చేసి రుణం పొందడం విశేషం.
రుణాల ద్వారా మనీ లాండరింగ్
జగదీశ్వరుడు బ్యాంక్ రుణాల ద్వారా మనీ లాండరింగ్‌కు పాల్పడుతున్నట్లు అడ్వకేట్ వరుణ్‌కుమార్ తాజాగా యూనియన్ బ్యాంక్ ఎండీకి ఫిర్యాదు చేశాడు. బ్యాంక్ రుణాలను, గ్యారెంటీలను తీసుకొని.. వాటిని మళ్లించి ప్రజాధనం లూటీ చేస్తున్నాడని పేర్కొన్నాడు. థర్డ్ పార్టీ సెక్యూరిటీస్ ద్వారా నిధుల మళ్లింపునకు పాల్పడుతున్నాడని, రుణాల కోసం తప్పుడు టర్నోవర్‌ను చూపిస్తున్నాడని ఫిర్యాదులో వివరించాడు. బ్యాంక్ గ్యారంటీ, లెటర్ ఆఫ్ క్రెడిట్ ద్వారా ఏకంగా రూ.186.29 కోట్ల మోసానికి పాల్పడినట్టు పేర్కొన్నాడు. సీజ్ చేసిన ఆస్తిని చూపించి రుణాలను పొందాడని, కొత్త బ్యాంక్ అకౌంట్స్ తెరిచి, ఎన్‌పీఏలను చూపి నిధుల మళ్లింపు చేపడుతున్నాడని ఫిర్యాదులో స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో అతనికి ఓటీఎస్ ఇవ్వాలని చేస్తున్న ప్రయత్నాలు నిలిపివేయాలని.. క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment