విశాఖ విద్య: సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. విశాఖపట్నం– చర్లపల్లి– భువనేశ్వర్ మధ్య ప్రత్యేక రైలు(08549/08550) నడుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. రైలు నంబర్ 08549 విశాఖపట్నంలో ఈ నెల 18న సాయంత్రం 7.45 గంటలకు బయలుదేరుతుంది. రాత్రి 8.18 గంటలకు దువ్వాడ చేరుకుని, 8.20 గంటలకు అక్కడ నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. రైలు నంబర్ 08550 ఈ నెల 19న ఉదయం 9 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి సాయంత్రం 6.40 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. దువ్వాడలో 6.45 గంటలకు బయలుదేరి రాత్రి 7.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. విశాఖలో రాత్రి 7.50 గంటలకు బయలుదేరి ఈ నెల 20వ తేదీ తెల్లవారుజామున 2.15 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది.
● విశాఖపట్నం–చర్లపల్లి (08509) ప్రత్యేక రైలు ఈ నెల 18న సాయంత్రం 6.20 గంటలకు విశాఖలో బయలుదేరి 6.48 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడి 6.50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.00 గంటలకు చర్లపల్ల్లికి చేరుకుంటుంది. చర్లపల్ల్లి–విశాఖపట్నం(08510) ప్రత్యేక రైలు ఈ నెల 19న 10గంటలకు చర్లపల్ల్లిలో బయలుదేరి రాత్రి 9.30 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 9.32 గంటలకు బయలుదేరి రాత్రి 10.00 గంటలకు విశాఖపట్నం వస్తుంది.
● విశాఖపట్నం–చర్లపల్లి(08551) ప్రత్యేక రైలుఈ నెల 19న విశాఖపట్నంలో 6.20 గంటలకు బయలుదేరి సాయంత్రం 6.48 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడి నుంచి 6.50 గంటలకు అక్కడ బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. చర్లపల్లి–విశాఖపట్నం(08552) ప్రత్యేక రైలు ఈ నెల 20న ఉదయం 10 గంటలకు చర్లపల్ల్లి నుంచి బయలుదేరి రాత్రి 21.30 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడి నుంచి 9.32 గంటలకు బయలుదేరి రాత్రి 10 గంటలకు విశాఖపట్నం వస్తుంది. ప్రయాణికులు ఈ ప్రత్యేక రైలు సేవలను వినియోగించుకోవాలని సీనియర్ డివిజనల్ మేనేజర్ కె.సందీప్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment