మహారాణిపేట : సదరం రెండో విడత తనిఖీలకు అధికారులు సిద్ధమవుతు న్నారు. శనివారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ భరోసా దివ్యాంగుల పథకం కింద నెలకు రూ.15వేలు పింఛన్లు తీసుకుంటున్న ఇళ్లకు పలు శాఖల అధికారుల బృందం వెళ్లనున్నారు. జిల్లాలో సదరం సర్టిఫికెట్ల ద్వారా నూరు శాతం పర్సంటేజ్‌తో 319 మంది నెలకు రూ.15వేలు పింఛను పొందుతున్న సంగతి తెలిసిందే. తొలి విడత ఈనెల 9వ తేదీన మూడు ప్రాంతాల్లో విచారణ పూర్తి చేశారు. రెండో విడతలో దీర్ఘకాలిక వ్యాధులు, రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మంచం పట్టిన బాధితులు, మానసిక వ్యాధులతో మంచం పట్టిన బాధితుల ఇళ్లకు వెళ్లడానికి మూడు బృందాలను ఏర్పాటు చేశారు. ఆశీల్‌మెట్ట జోన్ పరిధి, భీమిలి, మధురవాడ ప్రాంతాల్లో వారికి కేటాయించిన ఇళ్లకు వెళ్లి సదరం సర్టిఫికేట్, దివ్యాంగుల స్థితిగతులు విచారణ చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment