‘నవోదయ’ పరీక్ష నిర్వహణకు పక్కా ఏర్పాట్లు
మహారాణిపేట: జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలకు ఈ నెల 18న జరగనున్న పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశించారు. ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా 39 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో గురువారం ఆయన తన చాంబర్‌లో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. నవోదయ ప్రిన్సిపాల్ డా. వై.ఎస్.ఎస్.చంద్రశేఖర్ మాట్లాడుతూ విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలో 39 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తామని, 9,080 మంది విద్యార్థులు హాజరు కానున్నారని వెల్లడించారు. మూడు జిల్లాలకు చెందిన పరీక్ష కేంద్రాల సూపరింటెండెంట్లు, పరిశీలకులకు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చామని తెలిపారు. పరీక్ష ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment