డాబాగార్డెన్స్: జీవీఎంసీలో 8 మంది స్టాండింగ్ కౌన్సిల్స్‌ను నియమించేందుకు న్యాయవాదుల నుంచి దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించినట్లు కమిషనర్ పి.సంపత్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. 8 మంది న్యాయవాదుల నియామకానికి దరఖాస్తుల స్వీకరణ గడువు ఈ నెల 6తో ముగిసిందని, పలువురి అభ్యర్థన మేరకు ఈ నెల 25 వరకు గడువు పొడిగించినట్లు కమిషనర్ పేర్కొన్నారు. ఓపెన్ కేటగిరీ (ఓసీ–జనరల్)లో 4, బీసీ ఏ–1, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్–1, ఎస్టీ–1, బీసీ బీ–1 నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. బార్ కౌన్సిల్లో కనీసం పదేళ్లు సభ్యుడిగా రిజిస్ట్రేషన్ పొంది ఉన్నవారు మాత్రమే అర్హులన్నారు. బార్ కౌన్సిల్లో ఈ సమాచారం పొందుపరిచామని, దరఖాస్తులు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో అందజేయాలని కమిషనర్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment