No Headline
పెందుర్తి నియోజకవర్గం నరవ ప్రాంతంలో చెరోవైపు పంచుకొని మరీ కూటమి నేతలు గ్రావెల్ తవ్వకాలను చేపడుతున్నారు. వాస్తవానికి ఈ భూమి ఏపీఐఐసీతో పాటు అటవీశాఖకు చెందినది. ఇక్కడ గ్రావెల్ తవ్వకాలకు అనుమతి లేదని మైనింగ్ అధికారులు కూడా పేర్కొంటున్నారు. దీనిపై గతంలో ‘సాక్షి’ పలు కథనాలు ప్రచురించింది. దీంతో అప్పటి తహసీల్దార్ అక్కడకు వెళ్లి వాహనాలు వెళ్లకుండా అడ్డుగా గుంతలు తవ్వారు. ఇప్పుడు ఆ గుంతలను పూడ్చడంతో పాటు కూటమి నేతలు చెరోవైపు రాత్రి, పగలు తేడా లేకుండా భారీగా గ్రావెల్‌ను తరలిస్తున్నారు. ప్రస్తుత తహసీల్దారు అటువైపుగా కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇక మైనింగ్ అధికారుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, ఇంత దర్జాగా తవ్వకాలు సాగుతుండటానికి కారణం సదరు వ్యక్తులు.. స్థానిక నియోజకవర్గ కూటమి నేతకు ‘పీఆర్’ ట్యాక్స్ పేరుతో ట్రిప్పునకు ఇంత మొత్తం చెల్లిస్తుండటమే. మొత్తంగా కూటమి నేతలు ఎక్కడికక్కడ స్థానికంగా ట్యాక్స్ పేరుతో వసూళ్లకు తెగబడుతుండటం చర్చనీయాంశమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment