28 నుంచి ‘పాలిటెక్నిక్’ స్పోర్ట్స్ మీట్
మురళీనగర్ : రాష్ట్ర స్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌ను విజయవంతం చేయాలని సాంకేతిక విద్యాశాఖ కాకినాడ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు (ఆర్‌జేడీ) జె.సత్యనారాయణ మూర్తి కోరారు. కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాట్లను స్థానిక ప్రిన్సిపాల్ డాక్టర్ కె.నారాయణరావు, కోఆర్డినేటర్, శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ బి.జానకిరామయ్యతో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. ఈనెల 28 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించే ఈ పోటీల్లో 13 రీజియన్స్ నుంచి 1,612 మంది విద్యార్థులు పాల్గొంటారని, వీరికి అవసరమైన సౌకర్యాలను కల్పించాలని సూచించారు. అన్ని విభాగాల క్రీడలు నిర్వహణకు అనుకూలంగా క్రీడా మైదానాన్ని సిద్ధం చేయాలన్నారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ మీట్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల ప్రిన్సిపాళ్లు, వివిధ విభాగాల శాఖాధిపతులు, స్థానిక పీడీ అబ్బాస్ బేగ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment