మంత్రి బొత్సను కలిసిన ఐఐఐటీ డైరెక్టర్
విజయనగరం అర్బన్: నూతన సంవత్సరం సందర్భంగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణను ఆయన నివాసంలో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (ఆర్‌జీయూకేటీ) డైరెక్టర్ ప్రొఫెసర్ కొక్కిరాల వెంకట గోపాల ధనబాలాజీ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది అందరికీ శుభాలు కలగాలని మంత్ర బొత్స సత్యనారాయణ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. సర్వతోముఖాభివృద్ధికి నిరంతరం శక్తి వంచన లేకుండా పనిచేస్తున్న జిల్లా యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో ఓఎస్డీ సుధాకర్‌బాబు, పరిపాలన అధికారి ముని రామకృష్ణ, డీన్ మోహన్ కృష్ణ చౌదరి, ఫైనాన్స్ ఆఫీసర్ అసిరినాయుడు, డీన్ వెల్ఫేర్ రవి, పీఆర్ మామిడి షణ్ముఖ, ఐఐఐటీ ఉన్నతాధికారులు ఉన్నారు.
జాతీయస్థాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో సుస్మితకు స్వర్ణం
నెల్లిమర్ల రూరల్: అరుణాచల్‌ప్రదేశ్‌లోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీలో జరుగుతున్న డిసెంబర్ 28 నుంచి ఐడబ్ల్యూఎల్‌ఎఫ్ జాతీయస్థాయి యూత్ వెయిట్‌లిఫ్టింగ్ చాం పియన్‌షిప్ పోటీల్లో నెల్లిమర్ల మండలంలోని కొండవెలగాడ గ్రామానికి చెందిన క్రీడాకారిణి వల్లూరి సుస్మిత స్వర్ణ పతకం సాధించింది. 55 కేజీల యూత్ విభాగంలో పోటీలో పాల్గొన్న సుస్మిత స్నాచ్‌లో 77 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 96 కిలోలు..మొత్తం 173 కిలోల బరువును ఎత్తి స్వర్ణ పతకం దక్కించుకుంది. అలాగే జూనియర్ విభాగంలో రజత పతకం కై వసం చేసుకుంది. ప్రతిభ కనబరిచిన క్రీడాకారిణికి జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రతినిధులు లక్ష్మి, వెంకటరామయ్య, చల్లా రాము, తదితరులు అభినందనలు తెలిపారు.
ఏపీఎస్‌ఈజీసీ సభ్యుడిగా అల్లు లావణ్యకుమార్
సాక్షి ప్రతినిధి, విజయనగరం: గ్రామీణాభివృద్ధిలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ కౌన్సిల్ (ఏపీఎస్‌ఈజీసీ) సభ్యుడిగా పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన అల్లు లావణ్యకుమార్ (రాహుల్‌నాయుడు) నియమితులయ్యారు. ప్రస్తుతం ఇంటిగ్రేటెడ్ రూరల్ పీపుల్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఐఆర్‌పీడబ్ల్యూఏ) కోశాధికారిగా సేవలందిస్తున్న ఆయనకు ఈ ప్రభుత్వం ఈ అవకాశం కల్పించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. తనకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాసేవలో తనకు తోడ్పాటు అందిస్తున్న వైఎస్సార్‌సీపీ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్ రాజు, కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణికి ధన్యవాదాలు చెప్పారు.
వైద్యశిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
● జగనన్న సురక్ష రాష్ట్ర నోడల్ అధికారి స్వప్న
డెంకాడ: ఈ నెల రెండో తేదీ నుంచి నిర్వహించనున్న జగనన్న సురక్ష వైద్య శిబిరాలను రోగులు సద్వినియోగం చేసుకోవాలని జగనన్న సురక్ష కార్యక్రమం రాష్ట్ర నోడల్ అధికారి స్వప్న కోరారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీని సోమవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా వైద్యశిబిరాలకు అవసరమైన మందుల నిల్వలను పరిశీలించారు. కార్యక్రమం విజయవంతమయ్యేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వైద్యులు భవానీ, శివరామకృష్ణలను ఆదేశించారు.
బ్రాయిలర్
లైవ్ డ్రెస్‌డ్ స్కిన్ లెస్
శ్రీ110 శ్రీ290 శ్రీ200
Comments
Please login to add a commentAdd a comment