విజయనగరం
–8లో
పల్లెకు పోదాం చలోచలో..
పల్లె గూటికి పండగ వచ్చింది. దూర ప్రాంతాల్లో నివసించేవారంతా సంక్రాంతి పండగకు వడివడిగా పల్లెలకు చేరుకుంటున్నారు. వీరి రాకతో విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వేస్టేషన్లు సోమవారం సందడిగా మారాయి. – సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం
మన బాహుబలి
కలియుగ భీముడు.. ప్రపంచ దేశాలలో భారతదేశ కీర్తి ప్రతిష్టలను చాటిచెప్పిన బాహుబలి మన కోడి రామ్మూర్తినాయుడు.
మంగళవారం శ్రీ 14 శ్రీ జనవరి శ్రీ 2025
వైభవంగా గోదాదేవి కల్యాణోత్సవం
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి వారి దేవస్థానంలో సోమవారం గోదాదేవి కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. ధనుర్మాస వ్రత ముగింపు రోజున ఏటా గోదాదేవి కల్యాణం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా వేకువజామున 4 గంటలకు స్వామివారికి ప్రాతఃకాలార్చన నిర్వహించి ధనుర్మాస ఉత్సవాన్ని జరిపించారు. ముందుగా గోదా అమ్మవారిని మంగళవాయిద్యాల నడుమ పల్లకిలో ఊరేగించారు. అనంతరం రామకోనేరు వద్ద అమ్మవారి విగ్రహానికి నలుగుపూసి మంగళస్నానం చేయించారు. గోదాదేవిని పెళ్లి కుమార్తెలా అలంకరించి దేవాలయానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. రామ సన్నిధిలో ప్రత్యేక పూజలు అనంతరం గోదాదేవికి శ్రీకృష్ణపరమాత్ముడితో కల్యాణాన్ని జరిపించారు. కార్యక్రమంలో ఈఓ వై.శ్రీనివాసరావు, అర్చకులు సాయిరామాచార్యులు, గొడవర్తి నరిసింహాచార్యులు, కిరణ్, వరప్రసాద్‌తో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కొత్త పింఛన్ల
మంజూరు ఎప్పుడు?
● ఎదురుచూస్తున్న అర్హులు
పార్వతీపురం: దారిద్య్రరేఖకు దిగువున ఉన్న వృద్ధులు, భర్త చనిపోయిన వితంతువులు, నడవలేని దివ్యాంగులు ప్రభుత్వం మంజూరు చేసే సామాజిక పింఛన్ల కోసం సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కొత్త పింఛన్లు ఇంకా మంజూరుచేయడం లేదని గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు చెబుతుండడంతో అర్హులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో పింఛన్లు, రేషన్‌కార్డుల దరఖాస్తు స్వీకరణ, మంజూరు ప్రక్రియ నిరంతరం కొనసాగేదని, నేడు ఆ పరిస్థితి లేకుండా ప్రస్తుత ప్రభుత్వం వెబ్‌సైట్ ఓపెన్ చేయకుండా కాలయాపన చేయడాన్ని తప్పుబడుతున్నారు. అలాగే, కొత్త రేషన్ కార్డుల కోసం వేలాదిమంది ఎదురు చూస్తున్నా నిరాశే ఎదురవుతోంది. కూటమి ప్రభుత్వం స్పందించి ఇచ్చిన హామీలు నెరవేర్చడంతోపాటు, అర్హులందరికీ పింఛన్లు, రేషన్‌కార్డులు మంజూరు చేయాలని కోరుతున్నారు.
పార్టీ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడిగా శ్రీకాంత్
బొబ్బిలి: వైఎస్సార్ సీపీ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడిగా శంబంగి శ్రీకాంత్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సోమవారం ఓ ప్రకటన జారీ అయింది. మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు కుమారుడైన శ్రీకాంత్.. కొన్నేళ్లుగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటున్నారు. ఈ విషయం గుర్తించిన అధిష్టానం ఆయనకు ఈ పదవిని కట్టబెట్టింది. తనపై పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, పార్టీ మరింత బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని శ్రీకాంత్ తెలిపారు.
గతేడాది డిసెంబర్ 24 వ తేదీ.. సమయం ఉదయం 11 గంటల ప్రాంతం.. ఓ వైపు వర్షం కురుస్తోంది... కాళీఘాట్ కాలనీలో నివసిస్తున్న కొట్టక్కి జగన్నమోహనరావు టైలరింగ్ షాపునకు వెళ్లారు. అతని భార్య ఇంటికి తాళం వేయకుండానే గాజులు కొనుక్కునేందుకు ఇంటి ఎదురుగా ఉన్న షాపునకు వెళ్లారు. అంతే... గత కొన్నాళ్లుగా రెక్కీ నిర్వహిస్తున్న జార్ఖండ్ రాష్ట్రం టాటానగర్‌కు చెందిన నేహా సబర్ అనే మహిళ, ఆమె భర్త సరోజ్ సోబర్‌లు అదును చూసి కుమార్తెతో కలిసి ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లో ఉన్న 18 తులాల బంగారు ఆభరణాలను కాజేశారు. బాధితుల ఇంటికి సమీపంలో ఉన్న మాంసం దుకాణం వద్దనున్న ఓ మహిళ వీరిని చూసి ఎవరని ప్రశ్నిస్తే వర్షం వల్ల కాసేపు అక్కడ తలదాచుకున్నామని చెప్పి పరారయ్యారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన వన్‌టౌన్ సీఐ ఎస్.శ్రీనివాస్, సిబ్బంది నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 18 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
గత ఏడాది సెప్టెంబర్ 2న రేగిడి మండలం ఉణుకూరు గ్రామానికి చెందిన మజ్జి భారతి అరసాడ వైపు ఉన్న తన పొలంలోకి పనులు నిమిత్తం ఒంటరిగా ప్రధాన రహదారిమీదుగా నడుస్తూ వెళ్తోంది. ఆదే సమయంలో వెనుక నుంచి బైక్‌పై గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ముఖానికి రుమాలు కట్టుకుని వచ్చి అరసాడ సమీపంలో భారతి మెడలో తుల మున్నర బంగారపు పుస్తెలతాడును తెంచుకుపోయారు.
ఇటీవల కాళీఘాట్ కాలనీలో చోరీకి పాల్పడిన 18 తులాల బంగారు ఆభరణాలను రికవరీ చేసిన పోలీసులు
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద భోగి మంట
ఎల్‌హెచ్‌ఎమ్‌ఎస్‌ను సద్వినియోగం చేసుకోండి
దొంగతనాల జోరు తగ్గించేందుకు జిల్లా పోలీస్‌శాఖ ప్రవేశపెట్టిన లాక్డ్ హౌస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఎల్‌హెచ్‌ఎమ్‌ఎస్)ను సద్వినియోగం చేసుకోవాలి. ఎవరైతే ఇళ్ల నుంచి రోజుల తరబడి ఊళ్లకు వెళ్తారో, వారు తప్పనిసరిగా తమ ఇంటి భద్రతకు సంబంధించి సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుచేస్తే పోలీసులు సీసీ కెమెరాలను అమర్చి వాటిని కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేస్తారు. దానిద్వారా అక్కడ పరిసర ప్రాంతాలకు ఎవరు వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం వెళ్తుంది. తద్వారా టీమ్‌ను అక్కడకు పంపించి దొంగతనాలు అరికట్టేందుకు అవకాశం ఉంది. ఊళ్లకు వెళ్లే వారంతా ఉచితంగా అందించే యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి. రాత్రి గస్తీని ముమ్మరం చేస్తున్నాం.
– వకుల్ జిందల్, ఎస్పీ, విజయనగరం
●
న్యూస్‌రీల్
డిసెంబర్ 13న సాయంత్రం 4 గంటల సమయంలో రాజాం పట్టణంలోని ఈశ్వరనారాయణ కాలనీకి చెందిన అమర సత్యన్నారాయణ ఇంటిలో గుర్తుతెలియని వ్యక్తి 13 తులాల బంగారాన్ని అపహరించాడు.
Comments
Please login to add a commentAdd a comment