విజేతలకు బహుమతుల పంపిణీ
చికెన్
బ్రాయిలర్ లైవ్ డ్రెస్‌డ్ స్కిన్‌లెస్ శ్రీ135 శ్రీ240 శ్రీ250
విజయనగరం టౌన్: వాజీ చానల్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన రంగోలి పోటీల విజేతలకు సోమవారం స్థానిక ఆనంద గజపతి ఆడిటోరియంలో బహుమతులు అందజేశారు. ప్రథమ విజేత ఎ. లతకు (హైదరాబాద్) ఎలక్ట్రికల్ స్కూటీ బహూకరించారు. బి. శాంతి (గుంటూరు), ఎం.సువర్ణ (విజయవాడ)ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. విజేతలందరికీ వాజీ చానల్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతినీడి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు పాకలపాటి రఘువర్మ, సురేష్‌బాబు, లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్ష్యుడు భీశెట్టి బాబ్జీ, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలవలస యశస్వి బహుమతులు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment