వీరఘట్టం తెలగవీధి వద్ద ఏర్పాటు చేసిన కోడి రామ్మూర్తినాయుడి విగ్రహం
కోడి రామ్మూర్తి నాయుడు చిత్రపటం
వీరఘట్టంలో రామ్మూర్తినాయుడు జన్మించిన
గృహం ఇదే
బ్రహ్మచారి....
కండల వీరుడు కోడి రామ్మూర్తినాయుడు నిత్య బ్రహ్మచారి. శాఖాహారి అయిన ఈయన ఆంజనేయస్వామి భక్తుడు. చిన్నతనంలో వీరఘట్టం సమీపంలోని రాజా చెరువు వద్ద వ్యాయామం చేస్తున్న సమయంలో ఓ సాధువు ఆయనను పిలి చి మంత్రోపదేశం చేశాడని సమాచారం. అప్పటి నుంచి రామ్మూర్తికి దైవచింతన కలిగింది.
యుక్త వయస్సులోనే....
రామ్మూర్తి తన 20 ఏళ్ల యుక్త వయసులోనే గుండెల మీద ఒకటిన్నర టన్ను బరువును మోసి చూపించేవారు. సర్కస్‌లో విచిత్రమైన, ఊహకందని విన్యాసాలు చేసేవారు. ఆయనను ఉక్కు గొలుసులతో బంధించేవారు. ఊపిరితిత్తుల నిండా గాలి పూరించి, ఆ గొలుసులను తెంచేవారు. రెండు కార్లకు గొలుసులు కట్టి, వాటిని తన భుజాలకు తగిలించుకుని కదలకుండా ఆపేవారు. ఏనుగును ఛాతి మీద ఎక్కించి దాదాపు ఐదు నిమిషాలు ఉండేవారు. అందుకే ఆయన సర్కస్‌కు విశేషమైన ఆదరణ ఉండేది. ఆసియాలోని జపాన్, చైనా, బర్మా దేశాల్లో కూడా రామ్మూర్తినాయుడు ప్రదర్శనలు ఇచ్చి భారతదేశ కీర్తిని చాటిచెప్పారు. బర్మాలో ఆయనపై హత్యాయత్నం జరగడంతో విదేశీ ప్రదర్శనలను నిలిపివేసి స్వదేశంలోనే స్థిరపడ్డారు.
బడికి డుమ్మా..
అప్పటి శ్రీకాకుళం జిల్లా, ప్రస్తుత పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టంలో పుట్టిన రామ్మూర్తినాయుడు చిన్నతనంలోనే తల్లిని కోల్పోయాడు. తల్లిలేని పిల్లాడు కావడంతో రామ్మూర్తిని తండ్రి వెంకన్ననాయుడు ఎంతో గారాబంగా చూసేవారు. ఈ గారాబంతో రామ్మూర్తినాయుడు బాల్యంలో బడికి వెళ్లకుండా డుమ్మా కొడుతూ.. వీరఘట్టంనకు సమీపంలో ఉన్న రాజా చెరువు వద్దకు వెళ్లి వ్యాయం చేస్తుండేవాడు. దీంతో తండ్రి వెంకన్న తప్పనిసరి పరిస్థితుల్లో కొడుకుని చదువు కోసం విజయనగరంలో ఉన్న తన తమ్ముడు నారాయణస్వామి ఇంటికి పంపించారు. విజయనగరంలో కూడా రామ్మూర్తికి చదువు అబ్బలేదు. విద్య కంటే వ్యాయామంపైనే ఎక్కువ ఆసక్తి చూపుతూ పలు మల్లయుద్ధ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచాడు. ఇక రామ్మూర్తికి చదువు వంటపట్టదని గ్రహించిన పినతండ్రి అతడిని మద్రాసు పంపించి వ్యాయామ కళాశాలల్లో చేర్పించారు. తర్వాత వ్యాయామ ఉపాధ్యాయునిగా నాయుడు విజయనగరంలో తను చదివిన కళాశాల్లోనే పీడీగా బాధ్యతలు చేపట్టారు.
కోడి
బయోపిక్....
కోడి రామ్మూర్తినాయుడి జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తీసేందుకు కొద్ది రోజుల కిందట కొంతమంది సినిమావాళ్లు వీరఘట్టం గ్రామానికి వచ్చి ఇక్కడ పరిస్థితులపై ఆరా తీశారు. వారం రోజులు వీరఘట్టంలో ఉండి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సినీ హీరో దుగ్గుబాటి రానా కోడి రామ్మూర్తిగా నటించనున్నారని అప్పటిలో పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి. తర్వాత ఈ విషయంపై ఎటువంటి ప్రస్తావన రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment