గంట్యాడ:
అగ్ని ప్రమాదంలో గాయపడిన ఓ వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతి చెందింది. వివరాల్లోకి వెళితే..మండలంలోని రామవరం గ్రామానికి చెందిన పూడి గౌరమ్మ( 81) ఈనెల 6వ తేదీన ప్రమాదవశాత్తు కుంపటిలో కూర్చొవడంతో గాయపడింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో సోమవారం కన్నుమూసింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సాయికృష్ణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment