ఆ గ్రామాల్లో రెండు రోజుల సంక్రాంతి..
డెంకాడ: మండల పరిధిలోని పలు గ్రామాల్లో సంక్రాంతి పండగను రెండు రోజులు నిర్వహిస్తారు. వాస్తవానికి భోగి, సంక్రాంతి, కనుమ పండగలను వరుసగా సోమ, మంగళ, బుధవారాల్లో నిర్వహించాల్సి ఉంది. అయితే ఆయా గ్రామాల్లో మంగళవారం పెద్ద పండుగ పేరుతో కొంతమంది సంక్రాంతి జరుపుకోగా.. మరుచటి రోజు మరికొంతమంది చిన పండుగ పేరుతో సంక్రాంతి జరుపుకోవడం విశేషం. పూర్వం నుంచి ఇదే ఆచారం కొనసాగుతోందని.. చిన పండుగ తర్వాత కనుమ, ముక్కనుమ జరుపుకుంటామని ఆయా గ్రామాల పెద్దలు చెబుతున్నారు. మండలంలోని పినతాడివాడ, పెదతాడివాడ, గుణుపూరుపేట, గుణుపూరు, డెంకాడ, సింగవరం, నాతవలస, డి.కొల్లాం, చొల్లంగిపేట, గొడిపాలెం, వెదుళ్లవలస, తదితర గ్రామాల్లో రెండు రోజుల సంక్రాంతి ఆచారం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment