20 నుంచి కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు
పార్వతీపురం: కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు కోసం ఈ నెల 20 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎ. శ్యామ్‌ప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. శరీరంపై స్పర్శలేని మచ్చలు, రాగిరంగు మచ్చలు, లావుగా మారిన నొప్పితో కూడిన నరములు, కాళ్లు, చేతుల కండరాల్లో బలహీనత ఉన్నా, తిమ్మిర్లు లక్షణాలున్నా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తిస్తే ఆరు నెలల్లో పూర్తిగా నయం చేయవచ్చన్నారు. సంక్షేమ వసతిగృహాల్లోని విద్యార్థులకు సైతం వైద్య పరీక్షలు చేయాలన్నారు. ఈ సర్వేకు ప్రజలు సహకరించాలని కోరారు.
బీఆర్‌ఏయూ క్రికెట్ జట్టుకు జీసీఎస్‌ఆర్ విద్యార్థులు
రాజాం సిటీ: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పురుషుల క్రికెట్ జట్టుకు స్థానిక జీసీఎస్‌ఆర్ విద్యార్థులు ఎంపికయ్యారని పీడీ చీకటి కేశవనారాయణ తెలిపారు. ఈ మేరకు విద్యార్థులను సోమవారం అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 7న శివాని ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన ఎంపిక పోటీల్లో కళాశాలకు చెందిన కె.రాజేష్‌కుమార్, కె.సాయిభాస్కర్ చక్కని ప్రతిభ కనబరిచి యూనివర్రిసటీ జట్టుకు ఎంపికయ్యారన్నారు. ఈ నెల 16 నుంచి 25 వరకు చైన్నె ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో జరగనున్న పోటీల్లో బీఆర్‌ఏయూ జట్టు తరఫున పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.పురుషోత్తమ్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్.రవీంద్రకుమార్, తదితరులు పాల్గొన్నారు.
ఆటో– బైక్ ఢీ
● నలుగురికి గాయాలు
గంట్యాడ: ఆటో, బైక్ ఢీ కొన్న సంఘటనలో నలుగురు గాయపడ్డారు. సోమవారం జరిగిన ప్రమాద వివరాలిలా ఉన్నాయి. మండలంలోని రామవరం గ్రామానికి చెందిన ఆర్.వాసు బైక్‌పై విజయనగరం వెళ్తున్నాడు. సరిగ్గా కరకవలస పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చేసరికి విజయనగరం నుంచి వస్తున్న ఆటో ఢీకొట్టింది. దీంతో వాసు కింద పడిపోవడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. అలాగే ఆటోలో ఉన్న పెదవేమలి గ్రామానికి చెందిన కొయ్యాన రమణకు చేయి విరిగిపోగా, మరో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. క్షతగాత్రుడు రమణ ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కారు ఢీ కొనడంతో ఒకరికి..
గజపతినగరం: మండల కేంద్రంలోని రైల్వేస్టేషన్ సమీపంలో పాలదారి చెరువు వద్ద కారు ఢీ కొన్న సంఘటనలో ద్విచక్రవాహనదారుడు గాయాలపాలైన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. దత్తిరాజేరు మండలం గదబవలస గ్రామానికిచెందిన నెలివాడ లోకేష్ అనే వ్యక్తి తన స్వగ్రామం నుంచి స్కూటీపై గజపతినగరం వస్తుండగా.. గజపతినగరం నుంచి మానాపురం వైపు వెళ్తున్న కారు అతడ్ని ఢీ కొట్టింది. దీంతో లోకేష్‌కు తీవ్రగాయాలు కావడంతో విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించారు. ఏఎస్సై శంకరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment