వీరఘట్టం: ఇండియన్ హెర్క్యులస్... కలియుగ భీముడు.. మల్లమార్తాండగా ప్రపంచ దేశాలలో భారతదేశ కీర్తి ప్రతిష్టలను చాటిచెప్పిన బాహుబలి మన కోడి రామ్మూర్తినాయుడు. ప్రస్తుత పార్వతీపురం మన్యం జిల్లాలోని వీరఘట్టం ఈయన స్వస్థలం. స్థానిక తెలగవీధికి చెందిన కోడి వెంకన్ననాయుడు, అప్పలకొండ దంపతులకు 1883 నవంబర్ 3న రామ్మూర్తినాయుడు జన్మించారు. హీరోలు ఒంటి చేత్తో కారును ఆపడం.. రెండు తాళ్లు కట్టి కారులను లాగడం.. బండరాళ్లను ఛాతీపై పెట్టి సమ్మెటలతో కొట్టించుకోవడం.. వంటి విన్యాసాలను మనం సినిమాల్లో చూస్తుంటాం. కాని ఇటువంటి ప్రదర్శనలెన్నో మన కోడి రామ్మూర్తినాయుడు ఎప్పుడో చేసి చూపించి, పలువురితో శభాష్ అనిపించుకున్నారు. అంతేకాకుండా తన సర్కస్ కంపెనీ ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో ప్రదర్శనలిచ్చి అంతర్జాతీయ స్థాయిలో ఇండియన్ హెర్క్యులస్‌గా పేరుగాంచారు. అటువంటి మహానుభావుడి మనోడే అన్ని చెప్పుకునేందుకు మన్యం ప్రజలు గర్విస్తున్నారు. 1942 జనవరి 14న ఆయన స్వర్గస్తులయ్యారు. ఈ నేపథ్యంలో రామ్మూర్తినాయుడు జీవిత చరిత్రపై సాక్షి అందిస్తున్న సమగ్ర కథనం....
Comments
Please login to add a commentAdd a comment