కనీసం మూడు పథకాలైనా వచ్చేవి..
మా ఊరిలో దాదాపు 2 వేల కుటుంబాలు ఉన్నాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రతి ఇంటికీ కనీసం మూడు పథకాలైనా వచ్చేవి. అమ్మ ఒడి, రైతుభరోసా, చేయూత, ఆసరా... ఇలా ఏదో ఒకటి వచ్చేవి. ప్రతి ఒక్కరి చేతిలో డబ్బులు ఉండేవి. పండగ వస్తుందంటే డబ్బుల కోసం చూసుకోవాల్సిన పని ఉండేది కా దు. మాకు వైఎస్సార్ రైతుభరోసా రాకపోవడంతో పొలం పనులకు అప్పులు చేశాం. దీంతో ధాన్యం దళారులకే అమ్ముకోవాల్సి వచ్చింది. తూకంలో క్వింటాకు 5 కేజీలు చొప్పున ఎక్కువగా తూసుకు న్నారు. కనీస మద్దతు ధర కన్నా రూ.200 తక్కువ గా ఇచ్చారు. – బలగం సీతంనాయుడు
Comments
Please login to add a commentAdd a comment