నేడు నైరాశ్యం
సాక్షి ప్రతినిధి, విజయనగరం:
కూటమి ప్రభుత్వంలో ప్రచారానికి, క్షేత్ర స్థాయిలో వాస్తవానికి ‘గుంకలాం’ గ్రామీణ చిత్రం అద్దం పడుతోంది. అభివృద్ధి పనులు మూలకు చేరాయి. ఇక సంక్షేమ పథకాలు అమలు నేతిబీరలో నేతి చందమే. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన ‘నవరత్నాల’ కన్నా మిన్నగా ‘సూపర్ 6’ పథకాలు అమలు చేస్తామన్న కూటమి ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు చేతులెత్తేస్తుండటంతో గ్రామీణ ఆర్థిక ముఖచిత్రం మారిపోయింది. అది ఈ సంక్రాంతి పండగ నాటికి సుస్పష్టంగా కనిపిస్తోంది. విజయనగరం రూరల్ మండలంలోని గుంకలాం గ్రామంలో ‘సాక్షి ప్రతినిధి’ ఆదివారం క్షేత్ర పర్యటనకు వెళ్లినప్పుడు సందడి లేని సంక్రాంతి వాతావరణం కనిపించింది. చేతిలో చిల్లగవ్వ లేక అప్పులు చేసి పండగకు పప్పుకూడు తినాల్సిన పరిస్థితి వచ్చిందని గుంకలాం వాసులు తమ ఆవేదన వెళ్లగక్కారు.
ఆవేదనలో అర్థం ఉంది
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఒక షెడ్యూల్ ప్రకారం సంక్షేమ పథకాల అమలు జరిగింది. లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేసే డీబీటీ పథకాలతో ప్రతి నెలా ఎంతోకొంత సొమ్ము చేతికొచ్చేది. ఇతర అభివృద్ధి పథకాల (నాన్ డీబీటీ)తో పరోక్షంగా ఉపాధి అవకాశాలు కలిగేవి. ఆస్తి సమకూరేది. ఇలా సంక్రాంతి వచ్చేసరికి ప్రతి కుటుంబానికి రూ.లక్షల్లోనే లబ్ధి ఒనగూరడటంతో అసలైన పండగ వాతావరణం కనిపించేది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి పథకాలేవీ అమలుకాలేదు. దీంతో ఏడాదిలోనే స్పష్టమైన తేడా గ్రామీణ ప్రాంతాల్లోనే కనిపిస్తోంది. ఒక్క గుంకలాం గ్రామంలోనే డీబీటీ, నాన్ డీబీటీ పథకాలతో 3,991 మందికి రూ.11.71 కోట్ల మేర మేలు జరిగింది. ముఖ్యంగా జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్ రైతుభరోసా పథకాలు గ్రామీణ ప్రజలకు ఎంతో ఆర్థిక భరోసా ఇచ్చేవి. ఇప్పుడా పరిస్థితి లేదు.
●పల్లెల్లో కానరాని ‘సంక్రాంతి’ సంబరం ●మళ్లీ అప్పుల్లోకి వెళ్తున్న గ్రామీణ జీవనం
●గ్రామాల గుండెచప్పుళ్లకు ‘గుంకలాం’ సాక్ష్యం ●‘సాక్షి’ క్షేత్ర పరిశీలనలో వెలుగులోకి పలు అంశాలు
ఇది విజయనగరం జిల్లా కేంద్రం నుంచి గుంకలాం గ్రామానికి ఉన్న బీటీ రహదారి. సంక్రాంతి నాటికల్లా పల్లెలకు వెళ్లే రోడ్లన్నీ గుంతల్లేకుండా బాగు చేస్తామని కూటమి ప్రభుత్వ పెద్దలు చెప్పారు. ఇప్పుడేమో పల్లె రోడ్లన్నీ చక్కగా తయారైపోయాయని చెబుతున్నారు. వారి మాటల్లో డొల్లతనం, పనుల్లో వాస్తవం ఏమిటో ఈ గుంకలాం రోడ్డు అద్దం పడుతోంది. ఎక్కడికక్కడ పిక్క, రాయిపిక్క బూడిద వేసి వదిలేశారు. కొన్నిచోట్ల ఆ పని కూడా సరిగా చేయలేదు. ప్రతిరోజూ ఆ రోడ్డుపై ప్రమాదకర పరిస్థితుల్లో రాకపోకలు చేయాల్సి వస్తోందని గుంకలాం గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు.
నాడు సంతోషం..
Comments
Please login to add a commentAdd a comment