విజయనగరం
సోమవారం శ్రీ 13 శ్రీ జనవరి శ్రీ 2025
ప్రత్యేక నిఘా
జిల్లాలో సంక్రాంతి పండగను పురస్కరించుకుని కోడిపందాలు, పేకాట, గుండాటలు, ఇతర రకాలైన జూద క్రీడలను నిర్వహిస్తే కఠినచర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. –10లో
మిలటరీ ఉద్యోగాలకు
పుట్టినిల్లు ముగడ
మండలంలోని ముగడ గ్రామం మిలటరీ
ఉద్యోగులకు పుట్టినిల్లుగా చెప్పుకోవచ్చు.
ఇది జగనన్న కాలనీ. పేద, సామాన్య కుటుంబాలకు సైతం సొంత ఇల్లు
ఉండాలనే లక్ష్యంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విజయనగరం జిల్లా కేంద్రానికి సుమారు పది కిలోమీటర్ల దూరంలోని గుంకలాం గ్రామ పంచాయతీ
పరిధిలో ఏర్పాటు చేసిన కాలనీ. కాదు... కాదు... వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వమే మరోసారి కొనసాగి ఉంటే ఈపాటికి అదో పట్టణమే అయ్యేదని స్థానికుల అభిప్రాయం. ఎందుకంటే ఇక్కడ 12,216 కుటుంబాలకు సొంత ఇల్లు సమకూర్చేలా 397 ఎకరాల్లో ఏర్పాటు చేసిన లేఅవుట్ ఇది. అందులో స్థలాన్ని అక్కచెల్లెమ్మల పేరుతోనే రిజిస్ట్రేషన్ చేసి నాటి ముఖ్యమంత్రి హోదాలో జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా వారికి పట్టాలు అందించిన విషయం తెలిసిందే. గత ఏడాది సంక్రాంతి సమయంలో కూడా భవన నిర్మాణ పనులు జరిగేవి. సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడు నెలల్లో చిత్రం మారిపోయింది. నిర్మాణ పనులు నిలిచిపోయాయి. సంక్రాంతి సందడే అక్కడ కనిపించలేదు.
సుఖసంతోషాలు
వెల్లివిరియాలి
● జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
విజయనగరం రూరల్: సంక్రాంతి పండగ శుభవేళ జిల్లాలోని ప్రతీ ఇంట సుఖ సంతోషాలు వెల్లివిరియాలని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆకాంక్షించారు. ఉమ్మడి జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, కార్యకర్తలకు, నాయకులకు ఆయన ఆదివారం ఒక ప్రకటనలో సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి నేపథ్యంలో పంటలు చేతికి అంది పల్లెలు ధాన్య రాశులతో కలకలలాడాలని పేర్కొన్నారు. ప్రతీ ఇంట భోగి పండగ భోగభాగ్యాలను అందజేయాలన్నారు. పల్లెలన్నీ సంక్రాంతి శోభతో నిండిపోవాలని ఆకాంక్షించారు.
ప్రజలందరికీ
సుఖసంతోషాలు కలగాలి
● కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
విజయనగరం అర్బన్: తెలుగు ప్రజలు ఎంతో ప్రత్యేకంగా జరుపుకునే సంక్రాంతి పండగ ప్రజలందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేసారు. భోగి పండగ భోగ భాగ్యాలు కలిగించాలని అందరి ఇళ్లలో సంక్రాంతి శోభ సంతరించాలని మూడు రోజుల పండగ సందడితో ప్రతి ఒక్కరూ ఆనందంగా గడపాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
బిల్లులు క్లియర్ చేశాం..
● మంత్రి కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం రూరల్: గడిచిన ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల బిల్లులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూ.6,750కోట్లను విడుదల చేసి అన్ని రంగాల కుటుంబాల్లో సంక్రాంతిని పురష్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలుగులు నింపారని సెర్ఫ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ కేటగిరీలకు సంబంధించి మొత్తం రూ,6750 కోట్లు పెండింగ్ బిల్లులను విడుదల చేయడం జరిగిందన్నారు. పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
గుంకలాం ప్రజలకు గత ప్రభుత్వంలో చేకూరిన లబ్ధి
పథకాలు లబ్ధిదారుల సంఖ్య అందిన లబ్ధి
ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) 1642 రూ.4,30,50,000
పరోక్ష ప్రయోజనాలు (నాన్ డీబీటీ) 2349 రూ.7,40,67,067
మొత్తం 3991 రూ.11,71,17,062
సంక్రాంతి సందడి లేదు
ఇంట్లో పెళ్లి జరిగితే ఎలాంటి సందడి ఉంటుందో గత ప్రభుత్వంలో అలా ఉండేది. పెళ్లి తర్వాత ఆడబిడ్డను అత్తారింటికి పంపిన తర్వాత అప్పులు లెక్కేసుకునేటప్పుడు ఎలాంటి నిశబ్దం నెలకొంటుందో ఇప్పుడీ కూటమి ప్రభుత్వంలో అలా ఉంది. గత ఏడాదికి ఇప్పటికీ సంక్రాంతి పండగ ఎంతో తేడా కనిపిస్తోంది. రానున్న ఐదేళ్లూ ఇంకా కష్టాలు ఉంటాయేమో! – బలగం ఆదిలక్ష్మి
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment