‘చింత’ తప్పదిక..!
భామిని:
పెద్ద పండగకు గిరిజనులకు చింతపండు కరువైంది. సంక్రాంతి పూట పితృ తర్పనానికి కొత్త చింతపండుతో వంటకాలు చేయడం సంప్రదాయం. తివ్వకొండ పరిసరాల్లో ఈ ఏడాది చింత పంట జాడ లేకుండా పోయింది. చింత చెట్లు తరిగిపోతుండడం, ఉన్నవి కాపులేకపోవడంతో ఆదివాసీ గిరిజనుల ప్రధానాదాయానికి గండి పడింది. చింత పంట లేక పోవడంతో గిరిజన గ్రామాల్లో చిరువ్యాపారుల సందడి కరువైంది. పండగ చింతపండు కోసం దళారీలు గిరిజన గ్రామాలకు వచ్చి కొనుగోలుచేసేవారు. ఈ ఏడాది గిరిజన గ్రామాల్లోనూ, వారపు సంతల్లోనూ చింత పండు లేకుండా పోయింది.
నాలుగో వంతుకు పడిన దిగుబడి...
ఏజెన్సీ సబ్‌ప్లాన్ మండలాల్లో సుమారు 5,000 చింతచెట్లు ఉంటాయని అంచనా. తిత్లీ తుఫాన్ తాకిడితో 3 వేల వరకు భారీ చింతచెట్లు నేలమట్టమయ్యాయి. వందలాది చెట్లకొమ్మలు విరిగిపోయాయి. దీంతో గతంలో 2000 టన్నుల వరకు చింతపండు దిగుబడి వస్తే ఇప్పుడు 500 టన్నులే వస్తోందని గిరిజనులు చెబుతున్నారు. కొత్త చెట్లు నాటడం తగ్గడం, పొగమంచు తాకిడితో పూత విపరీతంగా రాలిపోవడం వంటివి దిగుబడిపై ప్రభావం చూపుతున్నాయి.
ఏజెన్సీలో కాపు లేని చింతచెట్లు
పండగ పూట పులుపు కొరత
వారపు సంతల్లో చింత జాడలేదు
తగ్గుతున్న చింతచెట్లు
దిగుబడి 2 వేల టన్నుల నుంచి
500 టన్నులకు తగ్గనుందని
అంచనా
దిగుబడులు తగ్గాయి
ఏజెన్సీలో చింత పంట కనిపించడం లేదు. చెట్లు ఘననీయంగా తగ్గిపోయాయి. ఉన్నచెట్లకు పూత, కాపులేదు. ఈ ఏడాది పండగకు గిరిజనులకు సైతం కొత్త చింత పండు కొరత వచ్చింది. చింత పంట లేకపోవడంతో పండగ పూట ఆదాయానికి దెబ్బ పడింది.
– పిరపక శ్రీను, డైరెక్టర్, జీసీసీ, సీతంపేట
Comments
Please login to add a commentAdd a comment