సంక్రాంతి పండగను జిల్లా వాసులు సంప్రదాయబద్ధంగా నిర్వహిం
గంట్యాడ మండలం నందాం గ్రామంలో ముగ్గులు వేస్తున్న మహిళలు
సంక్రాంతి అంటే ఇంటిల్లిపాదీ సంతోషంగా గడుపుకునే పండగ.
ఆత్మీయత, ఆనందాలకు నెలవు. దీనికి ఎస్.కోట పట్టణంలోని కోటవీదిలో చదరం మహేష్ ఇంట్లో బుధవారం కనిపించిన ఈ చిత్రమే సాక్ష్యం. పండగ వేళ కుటుంబ సభ్యులందరూ కలిసి అరటి ఆకులపై ఒకేసారి భోజనం చేసి పిల్లలకు పండగ సంప్రదాయాన్ని వివరిస్తూనే కలిసుంటే కలదు సుఖమని నిరూపించారు. – శృంగవరపుకోట
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి దేవస్థానంలో కనుమ పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం గోవులకు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. వేకువజామున స్వామివారికి ప్రాతఃకాలార్చన, బాలభోగం నిర్వహించిన తరువాత కనుమ పండగ సందర్భంగా ఉత్తర రాజగోపురం వద్ద గోపూజలు జరిపించారు. గోమాత సకల దేవతామూర్తులకు నిలయమని, గోవును పూజిస్తే దేవతలందరినీ పూజించినట్లేనని అర్చకులు తెలిపారు. అనంతరం పుష్యమి నక్షత్రం సందర్భంగా యాగశాలలో అర్చకులు రామాయణంలోని పట్టాభిషేక సర్గహవనం చేసి పూర్ణాహుతి హోమం జరిపించారు. ఉత్సవమూర్తులకు కల్యాణోత్సవాన్ని జరిపి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
– నెల్లిమర్ల రూరల్
Comments
Please login to add a commentAdd a comment