పార్వతీపురం: ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం (పీఎంఈజీపీ)తో స్వయం ఉపాధి అవకాశాలున్నాయని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పీఎంఈజీపీ వివిధ రంగాలలో స్వయం ఉపాధి కల్పనకు రుణాలు అందిస్తుందన్నారు. తయారీ రంగ కార్యకలాపాలకు రూ.50లక్షలు, సేవా రంగ విభాగానికి రూ.20లక్షల వరకు బ్యాంకు రుణం లభిస్తుందని పేర్కొన్నారు. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 35 శాతం వరకు ప్రభుత్వం సబ్సిడీ ఉంటుందని, లబ్ధిదారుని వాటా 5 నుంచి 10శాతం వరకు ఉంటుందన్నారు. 18 ఏళ్లు కలిగిన యువత ఈ పథకాలను పొందేందుకు అర్హులని తెలిపారు. వ్యక్తిగత ఆదాయ పరిమితి లేదని, రూ.10లక్షలు పైబడిన తయారీ రంగ పరిశ్రమలకు, రూ.5లక్షలు పైబడిన సేవా రంగ పరిశ్రమలకు వర్తిస్తుందన్నారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కేవీఐసీఓఎన్‌లైన్.ఓఓవీ.ఇన్/పీఎంఈజీపీ ఈ పోర్టల్ వెబ్‌సైట్‌లో చడవచ్చని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment