చలి.. చలి...
విజయనగరం ఫోర్ట్:
జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గడంతో చలికి తట్టుకోలేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. మైదాన ప్రాంతాల కంటే గిరిజన ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. గిరిజన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో అక్కడ ప్రజలు ఉదయం 10 గంటల వరకు బయటకు రాలేని పరిస్థితి. చలి నుంచి ఉపశమనం పొందేందుకు చలి మంటలు వేసుకుంటున్నారు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు తగ్గిపో తుండడంతో జనం చలితో అల్లాడిపోతున్నారు. ఉదయం 9గంటల వరకు జనం బయటకు రాలేని పరిస్థితి. చలి తీవ్రతకు చల్లటి గాలులు తోడువ్వడంతో జనం విలవిలలాడిపోతున్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో పుట్‌పాత్, పూరి గుడెసల్లో నివసించేవారు అవస్థలు పడుతున్నారు. ఎముకల కొరికే చలి ఉండడంతో జనం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చలి కారణంగా అన్ని వర్గాల వారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మైదాన ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీలు ఉంటే గిరిజన ప్రాంతాల్లో 9 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయింది. ఉదయానే దట్టమైన పొగ మంచు కురవడంతో జనం బయటకు రాలేని పరిస్థితి. ముఖ్యంగా పేపర్‌బాయ్‌లు, రైతు లు మంచు కారణంగా బయటకు రాలేకపోతున్నారు.
సాయంత్రం 5గంటలకే పెరుగుతున్న చలి
ఉదయం 9 గంటల వరకు ఉంటున్న చలి సాయంత్రం 5 గంటలకే మళ్లీ ప్రారంభం అవుతుంది. దీంతో వివిధ పనులు ముగించుకుని ఇంటికి వెళ్లే వారు ఇబ్బంది పడుతున్నారు. బైక్‌లపై వెళ్లే వారు చలిలో డ్రైవింగ్ చేయలేక నానా అవస్థలు పడుతున్నారు. స్వెట్టర్లు, మంకీప్లెయర్, గ్లౌజులు వంటివి ధరించి నా చలికి రక్షణ ఇవ్వలేక పోతున్నాయి. చలికి చిన్న పిల్లలు, వృద్దులు, దీర్ఘకాలిక రోగులు, చర్మ సంబంధిత వ్యాధిగ్రస్తులు అవస్థలు పడుతున్నారు.
పడిపోతున్న ఉష్ణోగ్రతలు
గిరిజన ప్రాంతాల్లో గణనీయంగా తగ్గిన ఉష్ణోగ్రతలు
ఉదయం ఆరేడు గంటల వరకు
పొగ మంచు
Comments
Please login to add a commentAdd a comment