కోడిపందాలు, పేకాట శిబిరాలపై ప్రత్యేక నిఘా
విజయనగరం క్రైమ్: జిల్లాలో సంక్రాంతి పండగను పురస్కరించుకుని కోడిపందాలు, పేకాట, గుండాటలు, ఇతర రకాలైన జూద క్రీడలను నిర్వహిస్తే కఠినచర్యలు తప్పవని ఎస్పీ వకుల్ జిందల్ హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని కోరారు. గతంలో పేకాట, కోడిపందాలతో ప్రమేయమున్న 109మంది వ్యక్తులను గుర్తించి, వారిని మండల ఎగ్జిక్యూటివ్ మెజ్రిస్టేట్ వద్ద బైండోవర్ చేశామన్నారు. హైకోర్టు ఆదేశాలతో మండలస్థాయిలో రెవెన్యూ, స్థానిక పోలీసులు, జంతు సంరక్షణ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటుచేశామని పేర్కొన్నారు. కోడిపందాలు నిర్వహించే వారిపైనా, కోడి కత్తులను తయారుచేసే వారిపైనా, కోడిపుంజులకు కత్తులు కట్టిన వారిపైనా నిఘా పెట్టామని స్పష్టం చేశారు. కోడిపందాలు నిర్వహించే ప్రాంతాలను క్షేత్రస్ధాయిలో డ్రోన్స్‌తో పర్యవేక్షిస్తామని తెలిపారు. పండగలకు స్వంత గ్రామాలకు వెళ్లే ప్రజలు ప్లేస్టోర్ నుంచి ఎల్‌హెచ్‌ఎమ్‌ఎస్ మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని, స్థానిక పోలీసులకు సమాచారమిచ్చి సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇళ్లల్లో విలువైన వస్తువులు ఉంచవద్దని, సా ధ్యమైనంత వరకూ వాటిని తమతో తీసుకువెళ్లడం, లేదా బ్యాంక్ లాకర్లలో భద్రపర్చుకోవాలని సూచించారు.
ఎస్పీ వకుల్ జిందల్
Comments
Please login to add a commentAdd a comment