మహారాణి పైడితల్లి
● అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు
● చిలకలతో ప్రత్యేక అలంకరణ
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం పైడితల్లి అమ్మవారు వనంగుడిలో భోగీ సందర్భంగా మహారాణి అలంకరణలో భక్తులకు సోమవారం దర్శనమిచ్చారు. అర్చకుడు నేతేటి ప్రశాంత్ ప్రత్యేక పూజలు చేశారు. అలాగే చదురుగుడి, వనంగుడి ఆవరణల్లో వేదపండితులు వెలువలపల్లి నరసింహమూర్తి, దూసి శివప్రసాద్ భక్తిశ్రద్ధలతో మహాచండీయాగం నిర్వహించారు. చదురుగుడిని పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించడంతో పాటు పైడితల్లికి చిలకలు నివేదించారు. అలాగే సిటీ బస్టాండ్ వద్దనున్న కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో కొలువైన భవానీ శంకరస్వామికి అర్చకుడు వీకే గాయత్రీశర్మ ఆధ్వర్యంలో అన్నాభిషేకం చేపట్టారు. కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఫొటోలు : సాక్షి ఫొటోగ్రాఫర్ , విజయనగరం
Comments
Please login to add a commentAdd a comment