బొబ్బిలి రూరల్: పాఠశాలలోని విద్యార్థులకు మానసిక పటుత్వంతో పాటు వికాసం, శారీరక ధైర్యం, దేశభక్తిని తెలియజేయాలంటే ప్రతీ పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్‌తో పాటు ఎన్‌సీసీని ప్రవేశపెట్టాలని డెల్టా సంఘ అధ్యక్షుడు మింది విజయమోహనరావు డిమాండ్ చేశారు. మండలంలోని అలజంగి ఎంపీపీ పాఠశాలలో ఆ సంఘ సభ్యులు శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే చిన్నారుల్లో ప్రాధమిక హక్కులు, సామాజిక బాధ్యత, స్వీయ రక్షణ తదితర అంశాల్లో పూర్తి స్థాయి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరారు. సమావేశంలో సభ్యులు శ్రీనివాసరావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment