రైతన్నను ముంచేసిన తుఫాన్
మొక్కజొన్న
నీట మునిగింది...
వరిచేను కోత కోసిన తరువాత 15 రోజుల క్రితమే ఐదు ఎకరాల్లో మొక్కజొన్న విత్తనాలు వేశాను. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పొలాల్లో నీరు చేరి మొక్కజొన్న పంటంతా ముంపునకు గురైంది. ఇప్పుడిప్పుడే మొలకలు వచ్చిన దశలో భూమి ఊటపట్టింది. దీంతో నష్టమే జరుగుతుంది. ఎకరాకు రూ.10వేల చొప్పున పెట్టుబడి అయ్యింది.
–చింతల భుజింగనాయుడు, రైతు, తెర్లాం
విజయనగరం ఫోర్ట్:
రైతులను తుఫాన్ ముంచేసింది. గత నాలుగు రోజులుగా కురిసిన వర్షాలకు పంట పొలాలు చెరువులను తలపస్తున్నాయి. పనలపై ఉన్న వరి పంట నీటిలో తేలాయాడుతోంది. మొక్కజొన్న పంటకు నష్టం కలిగింది. పెసర, మినుము పంటలు దెబ్బతిన్నాయి. వేలాది హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లడంతో రైతన్నలు కన్నీరు పెడుతున్నారు.
నష్టం ఇలా...
తుఫాన్ వర్షాలకు వరి, మొక్కజొన్న, అపరాల పంటలు 5,013 హెక్టార్లలో దెబ్బతిన్నట్టు వ్యవసాయాధికారులు ప్రాథమిక అంచనా వేశారు. 13 మంది రైతులకు చెందిన 12 హెక్టార్లలో వరి పంట పూర్తిగా దెబ్బతిన్నట్టు నిర్ధారించారు. 699 మంది రైతులు సాగుచేసిన 741.55 హెక్టార్లలో మొక్కజొన్న, 4,244 మంది రైతులకు చెందిన 4,258.95 హెక్టార్లలో అపరాలు (పెసర, మినుము)లకు నష్టం వాటిల్లింది.
మినుము పంటకు అపార నష్టం
అరెకరా విస్తీర్ణంలో మినుము వేశాను. చేను బాగా ఎదుగుతున్న క్రమంలో వాయుగుండంతో వర్షాలు కురిశాయి. మొక్కలు పాడైపోయాయి. పంట పనికొచ్చే స్థితిలోలేదు. గతంలో సీఎంగా జగన్ ఉన్నప్పుడు పంటలు ఏవైనా నష్టపోతే పరిహారం వచ్చేది. ఇప్పుడు పంట నష్టం చూసేందుకు కూడా ఏ అధికారీ రాలేదు.
– కటికి శ్రీనివాసరావు, రైతు, రామభద్రపురం
జిల్లాలో 5,013 హెక్టార్లలో పంటలకు నష్టం
ప్రాఽథమికంగా అంచనా వేసిన
అధికారులు
నీట మునిగిన వరి, మొక్కజొన్న, పెసర, మినుము పంటలు
Comments
Please login to add a commentAdd a comment