చట్టాలపై అవగాహన అవసరం
విజయనగరం లీగల్: చట్టాలపై ఖైదీలు అవగాహన కలిగి ఉండాలని అదనపు సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి టి.వి.రాజేష్‌కుమార్ అన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయికళ్యాణ్ చక్రవర్తి ఆదేశాల మేరకు విజయనగరం సబ్‌జైల్‌ను శనివారం సందర్శించారు. కారాగారంలో ఉన్న ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సబ్ జైల్‌లో కొనసాగుతున్న జైల్ లీగల్ ఎయిడ్ క్లినిక్‌లను తనిఖీ చేశారు. జైల్ క్లినిక్‌ను సందర్శించే న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్లు నిర్వహిస్తున్న విధులపై ఆరా తీశారు. జైలులో ఉన్న ముద్దాయిలకు సకాలంలో న్యాయ సహాయం అందించడానికి జైల్ లీగల్ ఎయిడ్ క్లినిక్లను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. జైల్‌లో ఉన్న ముద్దాయిలకు ఉచిత న్యాయ సహాయం అందించడమే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ముఖ్య కర్తవ్యమన్నారు. జైలులో అమలవుతున్న సౌకర్యాలపై ఖైదీలను అడిగి తెలుసుకున్నారు. వంట గది, భోజనశాల, స్టోర్ రూమ్, మరుగుదొడ్లను పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment