డీఎంహెచ్‌ఓగా జీవనరాణి | - | Sakshi
Sakshi News home page

డీఎంహెచ్‌ఓగా జీవనరాణి

Published Sun, Dec 22 2024 1:25 AM | Last Updated on Sun, Dec 22 2024 1:25 AM

డీఎంహెచ్‌ఓగా జీవనరాణి

డీఎంహెచ్‌ఓగా జీవనరాణి

విజయనగరం ఫోర్ట్‌: జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి (డీఎంహెచ్‌ఓ)గా విశాఖపట్నం జిల్లా వ్యాధి నిరోధకటీకాల అధికారి డాక్టర్‌ ఎస్‌.జీవన రాణి పదోన్నతిపై నియామకమయ్యారు. ఇక్కడ డీఎంహెచ్‌ఓగా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్‌ ఎస్‌.భాస్కరరావుకు పార్వతీపురం మన్యం జిల్లాకు బదిలీ అయింది. ఈ మేరకు శనివారం వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిఎం.టి. కృష్ణబాబు ఉత్తర్వులు జారీచేశారు.

పంటల బీమా గడువు పెంపు

జిల్లా వ్యవసాయ అధికారి

తారకరామారావు

విజయనగరం ఫోర్ట్‌: రబీ పంటలకు బీమా గడువును ఈ నెలాఖరువరకు పెంచామని, రైతులు బీమా ప్రీమియం చెల్లించాలని జిల్లా వ్యవసాయ అధికారి వి.తారకరామారావు తెలిపారు. జిల్లాలో రబీలో 5,801 హెక్టార్లలో మొక్కజొన్న, 4,081 హెక్టార్లలో పెసర, 10,067 హెక్టార్లలో మినుము పంట సాగువుతోందన్నారు. వరి, మొక్కజొన్న, పెసర, మినుము తదితర పంటలకు బీమా ప్రీమియం చెల్లించేందుకు రైతు సేవా కేంద్రం అసిస్టెంట్‌ను సంప్రదించాలన్నారు. వరి పంటకు ఎకరాకు రూ.630, మొక్కజొన్నకు రూ.540, పెసర, మినుము పంటలకు రూ. 300 వంతున ప్రీమియం చెల్లించి బీమా సదుపాయం పొందాలన్నారు.

సంక్రాంతి పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

విజయనగరం టౌన్‌: నూతన సంవత్సరం, సంక్రాంతి పండగను పురస్కరించుకుని ‘సంక్రాంతి పురస్కారం–2025’కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సర్వేజనా సుఖినోభవంతు సాహిత్య, సామాజిక, సాంస్కృతిక సేవా సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్‌ ఈఎస్‌ఎన్‌ నారాయణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని సమాజ సేవకులు, ఉపాధ్యాయులు, వైద్యులు, ఇంజినీర్లు, యోగా, మెడిటేషన్‌, సంగీత, నృత్యగురువులు, క్రీడాకారులు, మేధావుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 31లోపు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. వివరాలకు 96523 47207 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

పంటల సస్యరక్షణే ప్రధానం

గజపతినగరం: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నుంచి పంటల సంక్షణకు రైతులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఏరవాక కేంద్రం జిల్లా కోఆర్డినేటర్‌ కె.లక్ష్మణ్‌ తెలిపారు. గజపతినగరం మండలం శ్రీరంగ రాజపురం, తుమికాపల్లి, లోగిశ గ్రామాలను ఆయన శనివారం సందర్శించారు. మొక్కజొన్న, వరి పంటలను పరిశీలించారు. మొక్కజొన్న సంరక్షణ పద్ధతులను వివరించారు. వ్యవసాయ అధికారులు కె.మహరాజన్‌, గోవిందమ్మ, ధనలక్ష్మి పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement