జగనన్నపై అభిమాన జల్లు
జననేత, వైస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఊరూరా సందడిగా సాగాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కేకులు కట్‌చేసి అభిమానులకు పంచిపెట్టారు. రక్తదాన శిబిరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు, రొట్టెలు, పలు చోట్ల పేదలకు చీరలు, దుప్పట్లు, రగ్గులు పంపిణీ చేశారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగాలని పార్టీ నేతలు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలని కోరారు. రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. ప్రజలకు అండగా నిలవాలని సూచించారు. – సాక్షి ప్రతినిధి, విజయనగరం
Comments
Please login to add a commentAdd a comment