పాలకొండ రూరల్: రిమాండ్ ఖైదీల ఆరోగ్య స్థితిగతులపై సబ్ జైల్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అదనపు జడ్జి సీహెచ్ వివేకానంద శ్రీనివాస్ కోరారు. పాలకొండ సబ్ జైల్‌లో స్థానిక జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి ఎ.విజయరాజుకుమార్‌తో కలసి శనివారం న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. రిమాండ్ ఖైదీలకు అందుతున్న న్యాయ సేవలపై ఆరా తీశారు. వారు చేసిన నేరం, బెయిల్ విషయంలో అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జైలు పరిసరాలు, పారిశుద్ధ్య నిర్వహణ, భోజనం, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. ఆయన వెంట శ్రీకాకుళం సబ్ జడ్జి ఆర్.సన్యాసిరావు, న్యాయవాదులు బి.రామ్మోహనరావు, ఆర్.కుమారస్వామి, ఎన్.సింహాచలం, జైల్ ఇన్‌చార్జి పి.చంద్రరావు, వార్డర్లు బి.విజయకుమార్, హేమ సుందర్, ఏఎస్సై శ్రీనివాస్‌నాయుడు తదితరులు ఉన్నారు.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అదనపు జడ్జి
Comments
Please login to add a commentAdd a comment