24న జిల్లా స్థాయి బాలుర కబడ్డీ పోటీలు | - | Sakshi
Sakshi News home page

24న జిల్లా స్థాయి బాలుర కబడ్డీ పోటీలు

Published Sun, Dec 22 2024 1:24 AM | Last Updated on Sun, Dec 22 2024 1:24 AM

-

విజయనగరం: కబడ్డీ, ఖోఖో క్రీడల పితామహుడు దివంగత వై.భగవాన్‌దాస్‌ మాస్టారు జయంతిని పురష్కరించుకుని ఈ నెల 24న జిల్లా స్థాయి ఉన్నత పాఠశాలల బాలుర కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు భగవాన్‌దాస్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ ప్రతినిధులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విజయనగరం జిల్లా కేంద్రంలోని కస్పా కార్పొరేషన్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో ఈ పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పోటీల్లో ప్రస్తుతం ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న బాలుర క్రీడాకారులు మాత్రమే పాల్గొనేందుకు అర్హులుగా పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనదలచిన క్రీడాకారులు 94906 63367, 94947 77753 ఫోన్‌ నండర్లను సంప్రదించాలని సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement