సైనిక స్కూల్‌లో విద్యనభ్యసించడం పూర్వజన్మ సుకృతం
విజయనగరం రూరల్: కోరుకొండ సైనిక పాఠశాలలో విద్యనభ్యసించడం పూర్వజన్మ సుకృతమని పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్‌ఎస్.శాస్త్రి పేర్కోన్నారు. పాఠశాలలోని పివిజి.రాజు ఆడిటోరియంలో శనివారం జరిగిన వార్షికోత్సవ ముగింపుతో పాటు పేరేంట్స్ డే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. కోరుకొండ సైనిక పాఠశాలలో నిర్వహించిన ఈ వేడుకలు విద్యార్థుల ప్రయాణంలో మరో మైలురాయిని సూచిస్తున్నాయన్నారు. ఇక్కడ విద్యతో పాటు వ్యక్తిగత జీవనశైలి, క్రమశిక్షణ, వృత్తిపట్ల అంకితభావం, కుటుంబ విలువల వంటి ఎన్నో లక్షణాలను నేర్చుకోవడం తద్వారా వాటిని అమలు చేయడంలో పలువురికి ఆదర్శవంతులవ్వడం జరుగుతుందన్నారు. ముందు తరం విద్యార్థులు ఎంతో మందికి నేడు ప్రపంచంలోనే ఉన్నత స్థాయిలో ఉండి పాఠశాలకు, తద్వారా దేశానికి ఎంతో కీర్తిని తీసుకువచ్చారన్నారు. అనంతరం పాఠశాల విజయాలు, విద్యావేత్తలు, క్రీడలు, పాఠ్యాంశాలలో క్యాడెట్ల అద్భుతమైన ప్రదర్శనలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా ప్రతిభను, సృజనాత్మకతను చాటిచెప్పే సాంసృతిక ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో రియర్ అడ్మిరల్ కె.శ్రీనివాస్‌తో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ప్రిన్సిపాల్ ఎస్‌ఎస్.శాస్త్రి
Comments
Please login to add a commentAdd a comment