విజయనగరం క్రైమ్: ఇంట్లో ఎవరూ లేనిసయంలో ఇద్దరు పిల్లలతో కలిసి ఓ వమహిళ ఇంట్లో చొరబడి బీరువాలో ఉన్న 16 తులాల బంగారు ఆభరణాలను చోరీచేసింది. దీనికి సంబంధించి బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. వన్‌టౌన్ సీఐ ఎస్.శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం..
విజయనగరం కాళీఘాట్ కాలనీలో నివసిస్తున్న కొట్టక్కి జగన్మోహనరావు మంగళవారం ఉదయం 11 గంటలకు టైలర్ వద్దకు బట్టలు కొలతకు వెళ్లి అక్కడ అరగంట ఉన్నారు. అదే సమయంలో భార్య వకులాదేవి ఇంటితలుపులు దగ్గరకు వేసి ఎదురుగా ఉన్న గాజులషాపుకు వెళ్లింది. ఇంతలో ఇంటి ఎదురుగా ఉన్న మటన్ షాపు నడుపుతున్న బేగం వకులాదేవి వద్దకు వచ్చి మీ ఇంట్లో ఒక ఆడమనిషి వెళ్లి తిరిగి వెళ్లిపోతోందని చెప్పారు. ఆమెను ఎందుకు వెళ్లావని నిలదీయడంతో ఆమె గాబరాపడుతూ వర్షం పడుతున్నందున వెళ్లానంటూ తన ఇద్దరు పిల్లలను పట్టుకుని నడుచుకుంటూ వెళ్లిపోయింది. ఇంట్లోకి వెళ్లి బీరువాను పరిశీలించగా బీరువాలో ఉన్న నాలుగు తులాల కాసులపేరు, నాలుగు తులాల హారం, మూడు గోల్డ్ చైన్‌లు, చెవుదిద్దులు మూడు జతలు, రెండు గాజులు, ఐదు ఉంగరాలు, నెక్లెస్, బ్రాస్‌లెట్ ఇలా 16 తులాల వరకూ బంగారు ఆభరణాలు పోయినట్లు గుర్తించారన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment