విత్తన డీలర్లపై కేసుల నమోదు
విజయనగరం ఫోర్ట్: పంట దిగుబడికి విత్తనమే మూలం. నాణ్యత లేని విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వల్ల పంట దిగుబడి తగ్గిపోతుంది. రైతులు నష్టపోతారు. ఏటా వ్యవసాయ శాఖ అధికారులు విత్తన, ఎరువులు, పురుగుమందులు శాంపిల్స్ సేకరించి, నాణ్యత లేనివిగా తేలితే కేసులు నమోదు చేస్తారు. 2024 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి కూడా పలువురు డీలర్లపై కేసులు నమోదు చేశారు. 488 విత్తన శాంపిల్స్‌ను వ్యవసాయ అధికారులు సేకరించగా వాటిలో ఆరు విత్తన శాంపిల్స్ నాసిరకమైనవిగా నిర్ధారణ అయ్యాయి. వేపాడ, విజయనగరం, గరివిడి, జామి మండలాల్లో ఒక్కో డీలర్‌పైన, రాజాంలో ఇద్దరిపైనా కేసులు నమోదుచేశారు. 304 ఎరువుల శాంపిల్స్ సేకరించగా, దత్తిరాజేరు మండలంలో సేకరించిన శాంపిల్స్ నాణ్యత లేనిదిగా నిర్ధారించారు. సంబంధిత డీలర్‌పై కేసు నమోదు చేశారు. పురుగు మందుల శాంపిల్స్ 147 సేకరించగా, గరివిడి మండలంలో సేకరించిన శాంపిల్ నాణ్యత లేదని నిర్ధారణ అయింది. దీంతో సంబంధిత డీలర్‌పై కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment