రహదారి నిబంధనలను పాటించాలి
విజయనగరం అర్బన్: రహదారిపై ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరూ నిబంధనలను పాటించాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోరారు. అజాగ్రత్తగా వాహనాన్ని నడపడం వల్లే 90 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని నిబంధనలను పాటించడం ద్వారా వాటిని నివారించవచ్చునని సూచించారు. వాహనాలను నడిపేటప్పుడు నిర్లక్ష్యాన్ని విడనాడాలని హితవు పలికారు. తమ కుటుంబాలను, పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అయినా భద్రతా నియమాలను పాటిస్తూ జాగ్రత్తగా వాహనాలను నడపాలని సూచించారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను కలెక్టర్ తన చాంబర్‌లో గురువారం ప్రారంభించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. గురువారం నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు జరిగే మాసోత్సవాల్లో భాగంగా రహదారి భద్రతా నియమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివిధ వర్గాల ప్రజలకు, వాహన డ్రైవర్లకు విస్తృతస్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ మణికుమార్, ఆర్‌టీఓ విమల, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ బీఆర్‌అంబేడ్కర్
Comments
Please login to add a commentAdd a comment