ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష
● 86.81 శాతం మంది హాజరు
విజయనగరం అర్బన్: నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశానికి జిల్లా వ్యాప్తంగా 32 కేంద్రాల్లో శనివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్షకు 6,207 మంది దరఖాస్తు చేయగా 86.81 శాతంతో 5,381 మంది హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను 32 మంది ముఖ్య పర్యవేక్షకులు, 32 మంది పరిశీలకులు పర్యవేక్షించగా, 291 మంది ఇన్విజిలేటర్లుగా పనిచేశారని డీఈఓ యు.మాణిక్యంనాయుడు తెలిపారు.
రేపటి నుంచి పశు వైద్య శిబిరాలు
● కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో ఈ నెల 20 నుంచి 31వ తేదీ వరకు పశువైద్య శిబిరాలను నిర్వహిస్తామని కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలిపారు. ఈ మేరకు తన చాంబర్‌లో శిబి రాలకు సంబంధించిన వాల్ పోస్టర్లను శనివారం ఆవిష్కరించారు. రైతులందరూ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శిబిరాల్లో సాధారణ, గర్భకోశ వ్యాధులకు చికిత్సలు, వ్యాధి నిరోధక టీకాలు, నట్టల నివారణ మందుల పంపిణీ, పశు వ్యాధి నిర్ధారణ పరీక్షలు, శాసీ్త్రయ పశు యాజమాన్య పద్ధతులపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో జేసీ సేతు మాధవన్, జిల్లా పశు సంవర్థకశాఖ జేడీ డాక్టర్ వై.వి.రమణ, తదితరులు పాల్గొన్నారు.
‘స్వర్ణ ఆంధ్ర– స్వచ్ఛ ఆంధ్ర’
విజయనగరం అర్బన్: స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా కలెక్టరేట్‌లో శనివారం పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌గా తీర్చుదిద్దడానికి కృషి చేస్తామని కలెక్టరేట్ ఆవరణలో ఉన్న అన్ని శాఖల అధి కారులు, సిబ్బందితో కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జేసీ సేతు మాధవన్, డీఆర్‌ఓ శ్రీనివాసమూర్తి, ఆర్డీఓ కీర్తి, సీపీఓ బాలాజీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment