రూ.1800 చొప్పున లాగేశారు
విజయవాడలో ఉంటున్న నేను, నా కుటుంబీకులందరితో కలిసి ఈ నెల 13న విజయవాడలో బస్సు ఎక్కగా ప్రైవేట్ ట్రావెల్స్‌లో ఒక్కొక్కరికి రూ.1800లు చొప్పున తీసుకున్నారు. మేము 12 మంది బయలుదేరాము. మొత్తం రూ. 21,600ల బస్ చార్జీలకు చెల్లించాం. సాధారణ రోజుల్లో అందరం కలిసి వీరఘట్టం రావడానికి రూ.6వేలు ఖర్చు అయ్యేది. ఇప్పుడు రూ.21వేలకు పైగా ఖర్చు అయ్యింది. పండగ సీజన్ పేరుతో ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణికుల నుంచి దారుణంగా దోచుకుంటున్నారు.
– లోచర్ల గోవింద, వీరఘట్టం
దారుణం
వీరఘట్టంలో ఉన్న మా బంధువుల ఇంటికి సంక్రాంతికి భోగి పండగ రోజున ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఎక్కాను. స్లీపర్ రూ.2వేలు అన్నారు. సిటింగ్ రూ.1400లు అన్నారు. ఆర్థిక స్థోమతను బట్టి రూ.1400లు సిటింగ్‌లో కూర్చొని రావాల్సి వచ్చింది. సాధారణ రోజుల్లో ప్రైవేట్ బస్సు రూ.500లు ఇస్తే వీరఘట్టం వరకు టికెట్ చార్జీ తీసుకునే వారు. పండగ సీజన్‌లో మరీ ఎక్కువగా చార్చి చేస్తున్నారు. ఇది చాలా దారుణం.
– పి.వెంకటేశ్వరరావు, ఉయ్యూరు, కృష్ణాజిల్లా
●
Comments
Please login to add a commentAdd a comment