పోలింగ్‌ స్టేషన్ల పరిశీలన | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ స్టేషన్ల పరిశీలన

Published Tue, May 7 2024 5:00 AM

పోలింగ్‌ స్టేషన్ల పరిశీలన

కొత్తకోట రూరల్‌: పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సాధారణ పరిశీలకులు తైవాంగ్‌ గయాకో భూటియా ఐఏఎస్‌, 11–పీసీ మహబూబ్‌నగర్‌ వారు సోమవారం కొత్తకోట మండలంలోని పాలెం జెడ్పీహెచ్‌ఎస్‌, ప్రాథమిక పాఠశాల, అదేవిధంగా కొత్తకోట పట్టణ కేంద్రంలోని బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ స్టేషన్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్ల కోసం అధికారులు ఏర్పాటు చేసిన ర్యాంప్‌లు, వాష్‌రూంలు, ప్యాన్స్‌, లైట్స్‌, డోర్‌ ఏఎన్‌ఎఫ్‌ కిటికీలు వంటి వాటిని ఎన్నికల అధికారులు పరిశీలించారు. ఓటర్లకు ఓటరు స్లిప్‌ల పంపిణీ పూర్తి చేయాలని బీఎల్‌ఓలకు సూచించారు. వీరి వెంట తహసీల్దార్‌ బాల్‌రెడ్డి, యంఆర్‌ఐ వాసు, ఎంపీఓ రవీందర్‌బాబు, పంచాయతీ రాజ్‌ ఏఈ హుస్సేన్‌, మున్సిపల్‌ కమిషనర్‌ తదితరులు ఉన్నారు.

మదనాపురం: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ 255, 256, 257, 258 పోలింగ్‌ కేంద్రాలను ఎలక్షన్‌ జనరల్‌ పరిశీలకులు తైవాంగ్‌ గయాకో భూటియా ఐఏఎస్‌ సోమవారం రాత్రి ఆకస్మికంగా పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక వసతులను అడిగి తెలుసుకున్నారు. ర్యాంప్‌, వెంటిలేటర్‌, తాగునీరు, వాష్‌రూం, టాయిలెట్స్‌ పోలింగ్‌ చిట్టీల డిస్ట్రిబ్యూషన్‌ తదితర అంశాలను అధికారులతో ఆయన ఆరా తీశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ అబ్రహం లింకన్‌, సెక్టోరల్‌ ఆఫీసర్‌ కృష్ణయ్య, నరేష్‌, ఆర్‌ఐ రాజేశ్వరీ, బీఎల్‌ఓలు శారద, రజిత, పుష్పా, అరుణ పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement