వనపర్తి
గురువారం శ్రీ 19 శ్రీ డిసెంబర్ శ్రీ 2024
నాలుగు రోజులుగా చలి తీవ్రత పెరిగింది. చలికి తట్టుకోలేక చిన్నారులు, వృద్ధులు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ కాలంలో జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఉదయం, సాయంత్రం వేళలో ముక్కు, చెవులను కప్పి ఉంచేలా ఉన్ని దుస్తులు ధరించడంతో పాటు స్వెట్టర్ వేసుకోవాలి. సాధ్యమైనంత వరకు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి. అత్యవసరమైతే తగిన రక్షణ కవచాలను ధరించి ప్రయాణం చేయవచ్చు. ఉబ్బసం వ్యాధితో బాధపడే వారు ఆల్కహాల్, ధూమపానానికి దూరంగా ఉండటంతో పాటు ఆహార నియమాలు పాటించాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులు చలితో నిమోనియా బారినపడే ప్రమాదం ఉన్నందున బయట తిరగకపోవడం మంచిది. గోరువెచ్చని నీటిని తాగడంతో జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. చిన్నారులు బయటకు వెళ్లేటప్పుడు ఉన్ని దుస్తులు వేయాలి. చలి తీవ్రతతో ఇంట్లో ఎవరికై నా జ్వరం, జలుబు బారిన పడితే సొంత వైద్యం మాని వైద్యులను సంప్రదించాలి.
– అమరచింత
న్యూస్‌రీల్
చలికాలంలో జాగ్రత్తలు పాటించాలి..
Comments
Please login to add a commentAdd a comment