సర్కారీ వైద్యంపై నమ్మకం పెంచాలి
పాన్‌గల్: వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటూ సరైన చికిత్స అందిస్తూ ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం పెంచాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్స్ సెంటర్ చైన్నె వైద్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు డా. మొగన్, డా. మాలతి అన్నారు. బుధవారం స్థానిక పీహెచ్‌సీతో పాటు అన్నారం ఉప కేంద్రాన్ని వారు సందర్శించారు. ఆయా కేంద్రాల్లో రికార్డులు, హాజరు పట్టికలు, రక్తపోటు, మధుమేహం కేసుల స్క్రీనింగ్, పురోగతిని పరిశీలించి పలు సూచనలు చేశారు. అసంక్రమిత వ్యాధులు, అందుతున్న వైద్యాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఎన్‌సీడీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ తోట శ్రీధర్, ఎన్‌సీడీ కార్యక్రమ జిల్లా అధికారి డా. రామచంద్రారావు, జిల్లా కో–ఆర్డినేటర్ శ్రీనివాసులు, డబ్ల్యూహెచ్‌ఓ సీనియర్ ట్రీట్‌మెంట్ సూపర్‌వైజర్ రమేష్, పీహెచ్‌సీ వైద్యుడు డా. చంద్రశేఖర్, సీహెచ్‌ఓ రామయ్య, ఎంఎల్‌హెచ్‌పీ వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment