కలెక్టరేట్ ఎదుట ఆర్పీల ఆందోళన
వనపర్తి రూరల్: తమకు జీఓనంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని బుధవారం తెలంగాణ రిసోర్స్ పర్సన్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో ఆర్పీలు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మండ్ల రాజు, జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో సుమారు 6 వేల మంది ఆర్పీలుగా పనిచేస్తున్నారని తెలిపారు. వారికి రూ.6 వేల వేతనం చెల్లించడం ఎంతవరకు సమంజసమన్నారు. ఆ వేతనాలు కూడా వ్యక్తిగత ఖాతాల్లో జమ చేయకుండా సమైక్య ఖాతాల్లో జమ చేయడం ఏమిటని ప్రశ్నించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచడంతో పాటు వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో జమచేయాలని, డ్రస్‌కోడ్ అమలుచేస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిచో దశల వారీగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్‌లో ఏఓకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆర్పీలు, సీఐటీయూ నాయకులు నందిమళ్ల రాములు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment