వేగంగా నల్లచెరువు అభివృద్ధి
వనపర్తి: జిల్లాకేంద్రంలోని నల్ల చెరువు అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. బుధవారం ఆయన అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, పుర చైర్మన్ పి.మహేష్‌తో కలిసి చెరువుకట్ట ప్రాంతాన్ని పరిశీలించారు. పట్టణ ప్రజలు ఉదయం, సాయంత్రం వాకింగ్, వ్యాయామం చేసుకునేలా కట్టను తీర్చిదిద్దాలని, ఇందుకు అవసరమైన డీపీఆర్‌ను సిద్ధం చేసి ఇవ్వాలని పుర అధికారులను ఆదేశించారు. వంతెనపై భారీ వాహనాలు వెళ్లకుండా గేట్ ఏర్పాటు చేయాలని సూచించారు. వ్యాయామం చేసేందుకు ఓపెన్ జిమ్, పిల్లలు ఆడుకునేందుకు వీలుగా సామగ్రి, ఇరువైపులా అందమైన మొక్కలు నాటాలన్నారు.
2022–23 రబీ ధాన్యం డబ్బులు చెల్లించాలి..
2022–23 రబీ సీజన్‌కు సంబంఽధించి వరి ధాన్యం డబ్బులు వెంటనే చెల్లించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్ ధాన్యం డబ్బులు చెల్లించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంలో సహకరించిన మిల్లర్లకే భవిష్యత్‌లో ధాన్యం కేటాయింపులు చేస్తామన్నారు. సమావేశంలో డీఎస్‌ఓ కాశీ విశ్వనాథ్, మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment